TS School Summer Holidays 2023: నేటి నుంచి తెలంగాణలో వేసవి సెలవులు, జూన్ 12న తిరిగి ప్రారంభం కానున్న బడులు

దీంతో అన్ని బడులూ జూన్‌ 11వరకు మూతపడి, 12న తిరి­గి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో చివరి దినమైన సోమవారం పాఠశాలల్లో ఉపాధ్యాయులు పేరెంట్స్‌తో సమావేశం నిర్వహించా­రు.

Schools (Photo-ANI)

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు మంగళవారం నుంచి వేసవి సెలవులు అమలవుతాయి. దీంతో అన్ని బడులూ జూన్‌ 11వరకు మూతపడి, 12న తిరి­గి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో చివరి దినమైన సోమవారం పాఠశాలల్లో ఉపాధ్యాయులు పేరెంట్స్‌తో సమావేశం నిర్వహించా­రు.

మ‌హారాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ వరాల జల్లులు, బీఆర్ఎస్ అధికారంలోకి వ‌స్తే ఇంటింటికి తాగు నీరు, ప్ర‌తి ఎక‌రాకు సాగునీరు

ఈసారి జిల్లా స్థాయిలో కంప్యూటరీకరించి ఆన్‌లైన్‌లో ఉంచిన ప్రోగ్రెస్‌ కా­ర్డులను ఉపాధ్యాయులు డౌన్‌లోడ్‌ చేసి విద్యార్థులకు అందించారు. 1–9 విద్యార్థుల అన్ని స్థాయిల పరీక్షల మార్కులు, ఏడాది పొడవునా విద్యార్థి పురోగతి, నడవడికతో కూడిన అనేక అంశాలను అందులో పొందుపరిచారు. విద్యార్థి లోపాలు, అధిగమించాల్సిన అంశాలు, వేసవి సెలవుల్లో నేర్చుకోవాల్సిన విషయాలను ప్రోగ్రెస్‌ కార్డుల్లో సూచించారు.