Yellow Alert For TS: తెలంగాణకు మరో రెండు రోజులు ఎల్లో అలర్ట్, పలుజిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం, ఏయే జిల్లాలకు అలర్ట్ జారీ చేశారంటే?

తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Rains (Photo-Twitter)

Hyderabad, SEP 24:  తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Navdeep: డ్రగ్స్‌కేసులో ముగిసిన నవదీప్‌ విచారణ, ఏడేళ్ల క్రితం కాల్‌ లిస్ట్ ఆధారంగా విచారించిన నార్కొటిక్స్ అధికారులు, అన్ని విషయాలు చెప్పానన్న నవదీప్‌ 

ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, ములుగు, వరంగల్‌, సూర్యాపేట, నల్గొండతో పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదైందని టీఎస్‌డీపీఎస్‌ వివరించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement