Bandi Sanjay Slams KTR:  తెలంగాణలో 'ఆర్‌ కే' బ్రదర్స్ పాలన, కేటీఆర్ అరెస్ట్ కథ కంచికే, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేనని తేల్చిచెప్పిన కేంద్రమంత్రి బండి సంజయ్..బీఆర్ఎస్‌ను నిషేధించాలని డిమాండ్

దాడులతో ప్రజల ప్రాణాలాతో బీఆర్ఎస్ చెలగాటమడుతోందన్నారు. గ్రూప్ 1, కానిస్టేబుల్ ఆందోళనలోనూ బీఆర్ఎస్ విధ్వంసం చేయాలనుకుందని... తెలంగాణలో బీఆర్ఎస్ ను నిషేధించాలని డిమాండ్ చేశారు.

Union Minister Bandi Sanjay sensational comments on KTR(X)

Sangareddy, Nov 17:  బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ అని మండిపడ్డారు కేంద్రమంత్రి బండి సంజయ్. దాడులతో ప్రజల ప్రాణాలాతో బీఆర్ఎస్ చెలగాటమడుతోందన్నారు. గ్రూప్ 1, కానిస్టేబుల్ ఆందోళనలోనూ బీఆర్ఎస్ విధ్వంసం చేయాలనుకుందని... తెలంగాణలో బీఆర్ఎస్ ను నిషేధించాలని డిమాండ్ చేశారు.

సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన సంజయ్...ఢిల్లీలో సెటిల్ మెంట్.. కేటీఆర్ అరెస్ట్... కథ కంచికకే పోయిందన్నారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కాం కేసులన్నీ గాలికే వదిలేశారన్నారు. కలెక్టర్ పై దాడి సూత్రధారి కేటీఆర్ అని తేలినా అరెస్ట్ చేయకపోవడం సిగ్గు చేటు అన్నారు. కేటీఆర్ ను అరెస్ట్ చేయకపోవడం సర్కార్ చేతగానితనమే...రాష్ట్రంలో ఆర్ కే బ్రదర్స్ పాలన నడుస్తోందని విమర్శించారు.

కేసీఆర్, రేవంత్ కుటుంబానికి మధ్య వ్యాపార సంబంధాలున్నయ్...నేను నిరూపిస్తా కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. నాకు, రేవంత్ మధ్య వ్యాపార సంబంధాలున్నాయని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా? అని సవాల్ విసిరారు. రైతుల సమస్యను పక్కదారి పట్టించేందుకే దాడులు తెరపైకి తెస్తున్నారన్నారు. ప్రజలు వాస్తవాలు ఆరోపించాలన్నారు.  తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని కలిసిన అఘోరి, ఓ ప్రైవేట్ ఆస్పత్రి కార్యక్రమంలో ప్రత్యక్షం..వీడియో ఇదిగో

ప్రస్తుతం తాను కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నానని...రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగించే అవకాశాల్లేవ్ అన్నారు. ఓ రెండు రోజులు నేను కాళ్ళ నొప్పితో కనపడలేదు...దీనికి బీఆర్ఎస్ పార్టీ వాళ్లు రాద్దాంతం చేస్తున్నారన్నారు. అందుకే BRS సంగతి చెబుతామని వచ్చాను...లేచిన, పడుకున్న బీఆర్ఎస్ నేతలకు నేను గుర్తుకు వస్తున్న అన్నారు.

ధాన్యం కొనుగోలు చేయట్లేదు...రాష్ట్ర ప్రభుత్వం 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు టార్గెట్ పెట్టుకుందన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనకపోవడంతో దళారులకు తక్కువ ధరకు రైతులు అమ్ముకున్నారు...ఎన్నికల సమయంలో ధాన్యానికి 500 బోనస్ అని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకే అని అంటున్నారు..రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.