Ganesh Visarjan 2024: హైదరాబాద్ వాసులకు షాక్, హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ వెలిసిన ఫ్లెక్సీలు
ఇందులో భాగంగా ట్యాంక్‌బండ్ మార్గంలో భారీగా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనానికి అనుమతి లేదని ఫ్లెక్సీలు (Flexis Viral in Social Media) పెట్టారు.
Hyd, Sep 10: గణేష్ నిమజ్జనం అంటే హుస్సేన్ సాగర్ గుర్తుకు వస్తుంది.అయితే ఈ ఏడాది హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి (Ganesh Visarjan 2024) అధికారులు అనుమతించడం లేదు. ఇందులో భాగంగా ట్యాంక్‌బండ్ మార్గంలో భారీగా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనానికి అనుమతి లేదని ఫ్లెక్సీలు (Flexis Viral in Social Media) పెట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాగర్‌లో (Hussain Sagar) విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదు. జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ పోలీసుల పేరిట ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనానికి అనుమతి లేదంటూ… బ్యానర్లు కట్టారు.
కడప జిల్లాలో తీవ్ర విషాదం, నిమజ్జనంలో వినాయకుడి కింద పడి ఇద్దరు యువకులు మృతి, వీడియో ఇదిగో..
ఇదిలా ఉంటే హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో చేసిన విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయరాదని గతంలో హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి విదితమే. కాగా, హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదని న్యాయవాది వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలని కోరారు. సాగర్ పరిరక్షణ బాధ్యతలను హైడ్రా చూస్తోందని పేర్కొంది. ఈ పిటిషన్‌పై హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అయితే హైకోర్టు విచారణ చేయకముందే హుస్సేన్ సాగర్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై సర్వాత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.