Viral Video: ఉచిత బస్సులో ఖాళీగా ప్రయాణించడం ఎందుకని.. బ్రష్ చేసుకున్న మహిళ.. నెట్టింట వీడియో వైరల్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం తీసుకొచ్చింది.

Women Brushing in TG Bus

Hyderabad, July 29: తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం తీసుకొచ్చింది. తొలుత విపరీతంగా ఈ సదుపాయాన్ని వినియోగించుకున్న మహిళలు.. గతంలో కొట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. అలా వార్తల్లో నిలిచిన టీజీఆర్టీసీ ఇప్పుడు ఒక మహిళ చేసిన పనితో మరోసారి చర్చనీయాంశమైంది. బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్న ఓ మహిళ ఖాళీగా ఉండటం ఎందుకని అనుకున్నదో ఏమో? లేక ఊరెళ్ళే తొందరలో పండ్లు తోముకోవడం మర్చిపోయిందో గానీ.. ఏకంగా కదులుతున్న బస్సులోనే బ్రష్ చేసుకొంటూ కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఘటన ఏ డిపో పరిధిలో చోటు చేసుకుందో ఇంకా తెలియలేదు. అయితే, ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అమెరికాలో ఉన్నత చదువు.. ఆపై మంచి ఉద్యోగం.. ఇంకేంటి.. వచ్చే డిసెంబర్‌ లో అబ్బాయికి పెండ్లి చేద్దాం అనుకొన్నారు ఆ పేరెంట్స్.. ఇంతలో అంతులేని విషాదం.. అమెరికాలో ఈతకు వెళ్లి హైదరాబాదీ యువకుడి మృతి..

గతంలో ఇలా..

ఉచిత బస్సుల్లో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ఓ బస్సులో ఇద్దరు మహిళలు ఊరికే ఎందుకు కూర్చోవాలనుకున్నారో ఏమోగానీ.. బస్సులో ప్రయాణిస్తూనే బీడీలు చుడుతూ కనిపించారు. మరో మహిళ కూరగాయలు తరుగుతూ దర్శనమిచ్చారు. అప్పట్లో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.

కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు స్పాట్ డెడ్, బైక్‌పై వెళ్తున్న వారిని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం, పోలీసుల దర్యాప్తు

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement