Vande Bharat Express: శ్రీవారి భక్తులకు శుభవార్త.. వచ్చేనెలలో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు.. ఏప్రిల్ 8న ప్రారంభమయ్యే అవకాశాలు.. సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో భారీగా ప్రయాణికుల రద్దీ.. వందేభారత్ తో తిరుమల భక్తులకు మరింత ఉపయుక్తం

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు మరో రైలు జత కూడనున్నది. వచ్చే నెలలో సికింద్రాబాద్-తిరుపతి నగరాల మధ్య వందే భారత్ రైలు ప్రారంభం కానుంది.

Credits: Twitter

Tirupati, March 25: తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల (Telugu States) మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైలుకు మరో రైలు జత కూడనున్నది. వచ్చే నెలలో సికింద్రాబాద్-తిరుపతి (Secunderabad-Tirupati) నగరాల మధ్య వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. ఈ రైలును ఏప్రిల్ 8న ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ, ఏపీ మధ్య సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలు నడుస్తోంది. ఈ రైలుకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సికింద్రాబాద్-తిరుపతి మార్గంలోనూ ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి నిత్యం వేల మంది తిరుమల క్షేత్రానికి వెళుతుంటారు. వందేభారత్ రైలు రాకతో తిరుపతి వెళ్లేవారికి మరింత ఉపయుక్తంగా ఉండనుంది.

Dearness Allowance Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్, డీఏ 4శాతం పెంచుతూ కేబినెట్ నిర్ణయం, ఏడో వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా నిర్ణయం

మధ్యలో ఏయే స్టేషన్లు??

సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా నడపనున్నారు. ఈ రైలు ఆగే స్టేషన్లు, చార్జీలు, ప్రయాణ వేళలు వంటి అంశాలను త్వరలోనే వెల్లడించనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు వారంలో ఒక్కరోజు మినహా మిగిలిన అన్ని రోజులు అందుబాటులో ఉండనుంది.

Malnutrition: గుండెలు పిండేస్తున్న వీడియో, పోషకాహార లోపంతో మృతి చెందిన చిన్నారి, చావు బతుకుల మధ్య మరో చిన్నారి, ఒడిశాలో విషాదకర ఘటన

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement