Airtel Xstream Fiber Plans: ఎయిర్‌టెల్ నుంచి భారీ ఆఫర్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బండిల్ ప్యాకేజీలను ప్రకటించిన మెబైల్ సేవల దిగ్గజం, సెప్టెంబరు 7 నుంచి అందుబాటులోకి..

ప్రముఖ టెలికం కంపెనీ దిగ్గజం ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ వినియోగదారుల కోసం బండిల్ ప్యాకేజీలను (Airtel Xstream Fiber Plans) ఆదివారం విడుదల చేసింది. సెప్టెంబరు 7 నుంచి వినియోగదారులకు ఈ ప్యాక్‌లు (Airtel customers broadband plans) అందుబాటులోకి వస్తాయి. దీనిలో భాగంగా రూ.499కే అన్‌లిమిటెడ్ డేటా, టీవీ ఛానెళ్లు, ఓటీటీ యాప్స్ అన్నింటినీ ఇస్తోంది. ఈ బండిల్ ఆఫర్‌లో 550టీవీ ఛానెళ్లు, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5తోపాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో 10వేలపైగా సినిమాలు, షోలు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి.

Bharti Airtel. (Photo Credits: Twitter)

ఈ బండిల్‌లో భాగంగా మొత్తం ఐదు రీచార్జ్ ఆఫర్లను ఎయిర్‌టెల్ విడుదల చేసింది. వీటన్నింటిలో పైన చెప్పిన అన్ని సౌకర్యాలూ ఉంటాయి. అంటే 550టీవీ ఛానెళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, అన్‌లిమిటెడ్ డేటా, 10వేలపైగా సినిమాలూ, కార్యక్రమాలూ అన్ని వస్తాయి. రూ.499 రీచార్జ్ చేసుకుంటే 40ఎంబీపీఎస్‌ డేటా స్పీడ్ వస్తుంది.

జియోకు సవాల్, రూ. వొడాఫోన్ ఐడియాలోకి త్వరలో రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు, వీఐ పేరిట సరికొత్త లోగోను విడుదల చేసిన మొబైల్‌ సేవల దిగ్గజం

అదే రూ.799తో రీచార్జ్ చేయించుకుంటే 100ఎంబీపీఎస్, రూ.999 ప్యాక్‌లో 200ఎంబీపీఎస్, రూ.1499ప్యాక్‌తో 300ఎంబీపీఎస్, రూ.3999 ప్యాకేజీలో 1జీబీపీఎస్ వేగంతో డేటా వస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ 4కే టీవీ బాక్స్ వినియోగదారులకు ఈ ఆఫర్ల‌ను ప్రకటించారు. ఆండ్రాయిడ్ 9.0తో పనిచేసే ఈ బాక్సు ధర రూ.3999. అలాగే దీని రిమోట్‌.. గూగుల్ వాయిస్ సెర్చ్‌ను సపోర్ట్ చేస్తుంది.

ఎయిర్‌టెల్‌ అపరిమిత డేటా ఆఫర్‌, బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు డేటా పరిమితిని తొలగించనున్న కంపెనీ

అలాగే ఎయిర్‌టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు అయిన బేసిక్, ఎంటర్‌‌టైన్‌మెంట్, ప్రీమియం, వీఐపీ వంటి ప్లాన్లపై ఉన్న డేటా పరిమితిని ఎత్తివేసింది. ఇప్పుడు అన్ని ప్లాన్ల వినియోగదారులకు అపరిమిత డేటా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఫలితంగా తమ ఖాతాదారులు జియోకు మారకుండా జాగ్రత్త పడింది. అయితే, రూ. 299 అన్‌లిమిటెడ్ డేటా యాడ్ ఆన్ ప్యాక్‌ను తొలగించింది. అలాగే, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు ఇప్పటి వరకు అందిస్తూ వచ్చిన ప్రైమ్ వీడియో ప్రయోజనాలను తొలగించింది.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement