ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు కంపెనీ శుభవార్త ప్రకటించనుంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు (Airtel broadband Plans) అయిన బేసిక్, ఎంటర్‌టైన్‌మెంట్, ప్రీమియం, తదితర వాటికి ఇప్పటివరకు ఉన్న డేటా పరిమితిని తొలగించనుంది. ప్రస్తుతం అన్ని ప్లాన్ల వినియోగదారులకు అపరిమిత డేటా ఆఫర్ (Airtel Unlimited Data Offer) ఇవ్వనుంది. అయితే తమ ఖాతాదారులు జియోకు (JioFiber) మారకుండా ఉండే ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు రూ. 299 అన్‌లిమిటెడ్ డేటా యాడ్ ఆన్ ప్యాక్‌ను తొలగించింది. అయితే అపరిమిత డేటా ప్రయోజనం 3300 జీబీ ఎఫ్‌యూపీ క్యాప్‌తో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని OnlyTech వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఎయిర్‌టెల్ తాజా ఆఫర్‌కు సంబంధించిన వివరాలు ఎయిర్‌టెల్ వెబ్‌సైట్, మై ఎయిర్‌టెల్ యాప్‌లో పెట్టనున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు.
కాగా రిలయన్స్ జియోతో టెలికం ప్రపంచంలో భారీ పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టెలికం వర్గాలు చెబుతున్నాయి. ఇదివరకు ఆంధ్రప్రదేశ్, గుజరాత్ సర్కిళ్లలో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై అపరిమిత డేటాను అందిస్తున్న కంపెనీ విషయం తెలిసిందే.