Corona Caller Tune: విసిగిస్తోన్న కరోనా కాలర్ ట్యూన్, కాలయాపన తప్ప మరేమి లేదంటూ నెటిజన్ల గగ్గోలు, కాలర్‌ ట్యూన్‌ ఇంగ్లిష్‌లో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు

ఈ మధ్య మీరు గమనించారో లేదో ఎవరికైనా ఫోన్ చేస్తే మూడు సార్లు దగ్గు.. ఆ తర్వాత ఆంగ్లంలో కోవిడ్‌–19 వైరస్‌ గురించి ఉపన్యాసం.. చివరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ జారీ చేసిన ప్రకటన అంటూ 30 సెకన్ల పాటు మీకు రింగ్ టోన్ (Corona Caller Tune) వినిపిస్తూ ఉంది. గత రెండ్రోజులుగా రాష్ట్రంలోని అన్ని నెట్‌వర్క్‌ల మొబైల్‌ వినియోగదారులకు కోవిడ్‌ వైరస్‌ (COVID 19) వ్యాప్తి నిరోధం కోసం వస్తున్న కాలర్‌ ట్యూన్‌ ఇది.

Corona Caller Tune (Photo-ANI)

New Delhi, Mar 11:ఈ మధ్య మీరు గమనించారో లేదో ఎవరికైనా ఫోన్ చేస్తే మూడు సార్లు దగ్గు.. ఆ తర్వాత ఆంగ్లంలో కోవిడ్‌–19 వైరస్‌ గురించి ఉపన్యాసం.. చివరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ జారీ చేసిన ప్రకటన అంటూ 30 సెకన్ల పాటు మీకు రింగ్ టోన్ (Corona Caller Tune) వినిపిస్తూ ఉంది. గత రెండ్రోజులుగా రాష్ట్రంలోని అన్ని నెట్‌వర్క్‌ల మొబైల్‌ వినియోగదారులకు కోవిడ్‌ వైరస్‌ (COVID 19) వ్యాప్తి నిరోధం కోసం వస్తున్న కాలర్‌ ట్యూన్‌ ఇది.

కోవిడ్‌ వైరస్‌ (Coronavirus) వ్యాప్తి చెందకుండా కాలర్‌ ట్యూన్‌ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడంలో ఎవరికీ అభ్యంతరం లేదు కాని అది ఆంగ్లంలో (English) ఉండటం వల్ల గ్రామాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రజలను గజిబిజి చేసే విధంగా నంబర్లతో ముగించడంతో కాలయాపన తప్ప ప్రయోజనం ఏమీ లేదనే విమర్శలు వస్తున్నాయి. ఖ్యంగా ఈ కాలర్‌ట్యూన్‌ వలన రెండు రకాల ఇబ్బందులు వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ ట్యూన్‌తో పాటు కాల్‌ కనెక్ట్‌ కావడం లేదని, ఈ ట్యూన్‌ పూర్తయ్యాకే మనం ఫోన్‌ చేసిన వ్యక్తికి లైన్‌ కలుస్తుండటంతో చాలా టైమ్‌ వేస్ట్‌ అవుతోందని, పదేపదే అదే ట్యూన్‌ వినడం విసుగుపుట్టిస్తోందని మెజార్టీ మొబైల్‌ వినియోగదారులంటున్నారు.

అలాగే కాలర్‌ ట్యూన్‌ ఇంగ్లిష్‌లో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు అర్థం కాక ఫోన్‌ కలవడం లేదంటూ కట్‌ చేస్తున్నారు. కోవిడ్‌ కాలర్‌ ట్యూన్‌ కూడా ఇంగ్లిష్‌లోనే వస్తుండటంతో ఫోన్‌ కలవడంలో సమస్య ఉందని, అందుకే ఎవరో ఇంగ్లిష్‌లో చెబుతున్నారనే భావనతో గ్రామీణ నిరక్షరాస్యులు ఫోన్‌ కట్‌ చేస్తున్నారు.

కాలర్‌ట్యూన్‌ను మాతృభాషలో ఇస్తే అందరికీ అర్థమవుతుందని, తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశముందని నెట్టింట్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా తెలుగులో కాలర్‌ ట్యూన్‌ వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement