Vivo Diwali Offer: రూ.101 కే వివో స్మార్ట్‌ఫోన్లు, దివాళి ఆఫర్ అంటూ ట్వీట్ చేసిన వివో కంపెనీ, మైక్రోమాక్స్ నుంచి బడ్జెట్ ధరకు రెండు స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్లపై ఓ లుక్కేయండి
పండుగ సందర్భంగా వీ 20ఎస్, వీ 20, ఎక్స్ 50 సీరిస్ స్మార్ట్‌ఫోన్లను 101 రూపాయలకే సొంతం చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ఐసీఐసీఐ, కోటక్, ఫెడరల్‌బ్యాంకు , బ్యాంక్ ఆఫ్‌బరోడాల కార్డు కొనుగోళ్లపై 10శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.
రానున్న దీపావళి పండగ సీజన్‌ను పురస్కరించుకుని స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో బంపర్ ఆఫర్ (Vivo Diwali Offer) ప్రకటించింది. పండుగ సందర్భంగా వీ 20ఎస్, వీ 20, ఎక్స్ 50 సీరిస్ స్మార్ట్‌ఫోన్లను 101 రూపాయలకే సొంతం చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ఐసీఐసీఐ, కోటక్, ఫెడరల్‌బ్యాంకు , బ్యాంక్ ఆఫ్‌బరోడాల కార్డు కొనుగోళ్లపై 10శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.
దీపావళి ఆఫర్లతో కొత్త ఆనందాన్ని వెలిగించండి అంటూ వివో (Vivo) తాజాగా ట్వీట్ చేసింది. కేవలం రూ. 101 చెల్లించి (Vivo offers smartphone for just Rs 101) మీ కెంతో ఇష్టపడే వివో ఫోన్‌ను సొంతం చేసుకోండి. దీంతోపాటు అదనపు ప్రయోజనాలను కూడా ఆస్వాదించండని పేర్కొంది. అయితే ఎప్పటినుంచి ఎప్పటివరకు ఈ ఆఫర్ అందుబాటులోఉండనుందీ స్పష్టత ఇవ్వలేదు.
ఈ ఆఫర్ ప్రకారం మొదట 101 రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించి పైన పేర్కొన్న వాటిలో నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అనంతరం ఫోన్ విలువ మొత్తాన్ని ఎంపికచేసిన సులభ ఈఎంఐ వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే మొబైల్ కంపెనీలు పండుగ సమయాల్లో డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించడం సాధారణమేనని వినియోగదారులు అంటున్నారు.
Here's Vivo Tweet
ఇదిలా ఉంటే దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ ఇన్ బ్రాండ్ పేరుతో నోట్ 1, 1బీ స్మార్ట్‌న్లను లాంచ్ చేసింది. మార్కెట్లో పోటీ ధరలకు భిన‍్నంగా బడ్జెట్ ధరల్లో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది. గేమింగ్ అనుభవం కోసం 1బీ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఫస్ట్ సేల్ నవంబరు 26 నుంచి ప్రారంభం కానుంది.
2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ధర 6999
2 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర 7999
ఇన్1 బీ ఫీచర్లు
6.5 హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 10 (స్టాక్ యుఐ)
మీడియా టెక్ హీలియో జీ35 ప్రాసెసర్
13+2 ఎంపీ రియర్ ఏఐ కెమెరా
8 ఎంపీ సెల్పీకెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
పర్పుల్, బ్లూ , గ్రీన్ రంగుల్లో లభ్యం.
ఇన్ 1బీ ధరలు
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 10999
4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 12499
ఇన్ నోట్ 1ఫీచర్లు
6.67హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 10 (స్టాక్ యుఐ)
ఆండ్రాయిడ్ 11, 12 అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం
మీడియా టెక్ హీలియో జీ 85 ప్రాసెసర్
48+5+2+2ఎంపీ క్వాడ్ రియర్ ఏఐ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
18 వా (టైప్-సి)
గ్రీన్ , వైట్ కలర్స్‌లో లభ్యం.