Honor Magic 6 Pro: ఈ ఫోన్ ఉంటే కంటిచూపుతో మీ కారును కంట్రోల్ చేయొచ్చు, అత్యాధునిక ఏఐ ఆధారిత ఫీచర్లతో సరికొత్త హానర్ మ్యాజిక్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్ విడుదల, అదరహో అనిపించే ధర
Honor Magic 6 Pro Smartphone: బార్సిలోనాలో సోమవారం నుంచి వార్షిక మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ మరియు టెలికాం కంపెనీలు తమ ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. చైనీస్ టెక్నాలజీ కంపెనీ హానర్ తమ బ్రాండ్ నుంచి కొత్త మ్యాజిక్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేకమైన ఐ-ట్రాకింగ్ AI ఫంక్షన్‌ను అందిస్తున్నారు. ఇది ఏదైనా కారుకు రిమోట్‌గా పనిచేస్తుంది. తద్వారా వినియోగదారులు కేవలం తమ ఫోన్ స్క్రీన్‌ను చూడటం ద్వారా వారి కారు డోరును తెరవడం, లాక్ చేయడం, స్టార్ట్ చేయడం, కదిలించడం మొదలైన ఫంక్షన్‌ను అందిస్తుంది. ఇప్పటికే హానర్ కంపెనీ చైనాలో ఈ రకమైన AI ఫంక్షన్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది, ఇప్పుడు తమ సరికొత్త మ్యాజిక్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇతర మార్కెట్లను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే "నానోక్రిస్టల్ షీల్డ్" ద్వారా కూడా కవర్ చేయబడింది. గ్లాస్‌పై సిలికాన్ నైట్రైడ్ కోటింగ్ కూడా ఉంది, ఇది స్క్రీన్‌ను మరింత స్క్రాచ్ రెసిస్టెంట్‌గా చేస్తుంది.
Honor Magic 6 Pro అనేది ఒక ఒక హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. ఇది గతంలో విడుదల చేసిన మ్యాజిక్ V2 యొక్క ప్రీమియం అవతారంగా చెబుతున్నారు. ఈ ఫోన్ అధునాతన కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 180-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో పాటు OIS మరియు 2.5x ఆప్టికల్ జూమ్ సామర్థ్యం ఉన్నాయి. ఈ ఫోన్ నీరు, ధూళి నిరోధకత కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. సురక్షిత ఫేస్ అన్‌లాక్ కోసం DoF కూడా ఉన్నాయి.
హానర్ మ్యాజిక్ 6 ప్రో బ్యాటరీని ప్యాక్ కోసం మెరుగైన సిలికాన్ కార్బన్ టెక్‌ని ఉపయోగించారు. ఇది విపరీతమైన చలిలో ఛార్జ్ చేయడానికి, తక్కువ సామర్థ్యంలో ఎక్కువ విద్యుత్ నిల్వ చేయడానికి వీలు కల్పిస్తుంది. విలక్షణమైన పోర్స్చే అగేట్ గ్రే కలర్, విలాసవంతమైన డిజైన్‌తో ఎంతో ప్రత్యేకంగా ఉండే ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.
Honor Magic 6 Pro స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.8-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే
- 12GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్
- వెనకవైపు 50MP+50MP+180MP డ్యూయల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 50MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 14 MagicOS ఆపరేటింగ్ సిస్టమ్
- 5600 mAh బ్యాటరీ సామర్థ్యం, 80W ఫాస్ట్ ఛార్జింగ్
- ధర: సుమారు రూ. 1,16,500/- ఉండొచ్చని అంచనా.
ఇప్పటికే ఈ ఫోన్ కోసం ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమయ్యాయి, మార్చి 1 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.