IPL Auction 2025 Live

WhatsApp Tricks: పంపినవారికి తెలియకుండానే వాట్సాప్ మెసేజ్‌లు చదవడం ఎలాగో తెలుసా? ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలా ఈజీగా వాట్సాప్ ఓపెన్ చేయకుండానే ఫుల్‌ మెసేజ్‌ చదవచ్చు

ఈ యాప్‌లో చాలా ఫీచర్లు దాగి ఉన్నాయి. చాలావరకూ యూజర్లకు తెలియకపోవచ్చు. ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్‌లో పెద్దగా తెలియని కొన్ని ట్రిక్స్ వాట్సాప్‌లో అందుబాటులో ఉన్నాయి. మెసేజింగ్ యాప్‌ని అసలు ఓపెన్ చేయకుండానే ఈజీగా మెసేజ్‌లను పూర్తిగా చదవొచ్చు.

WhatsApp Logo. Representative Image. (Photo Credits: IANS)

New Delhi, March 01: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో వాట్సాప్ (WhatsApp) ఒకటి. ఈ యాప్‌లో చాలా ఫీచర్లు దాగి ఉన్నాయి. చాలావరకూ యూజర్లకు తెలియకపోవచ్చు. ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్‌లో పెద్దగా తెలియని కొన్ని ట్రిక్స్ వాట్సాప్‌లో అందుబాటులో ఉన్నాయి. మెసేజింగ్ యాప్‌ని అసలు ఓపెన్ చేయకుండానే ఈజీగా మెసేజ్‌లను పూర్తిగా చదవొచ్చు. అది ఎలా అంటారా? ఆండ్రాయిడ్ యూజర్లు లేదా ఐఓఎస్ (iOS WhatsApp) యూజర్లు లేదా వాట్సాప్ వెబ్ (WhatsApp Web) యూజర్లు ఎవరైనా ఇలా ఈజీగా ఆయా వాట్సాప్ ఫుల్ మెసేజ్‌లను యాప్ ఓపెన్ చేయకుండానే చదవొచ్చు. ఇప్పటికే వాట్సాప్ తమ యూజర్ల కోసం అనేక సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. అయితే, నోటిఫికేషన్ ప్యానెల్‌లో మీ WhatsApp మెసేజ్‌లు వచ్చినప్పుడు మీరు వాటిని ఎప్పుడైనా చదవవచ్చు. కానీ, మెసేజింగ్ యాప్ లాంగ్ ఉంటే పూర్తి మెసేజ్‌ను చూపదని గమనించాలి. వాట్సాప్ చాట్‌ను చూడకుండా ఉండేందుకు మీరు మెసేజ్ వెంటనే ఓపెన్ చేయకూడదనే సందర్భాలు చాలానే ఉంటాయి. ఒకవేళ, మీరు ముఖ్యమైన మెసేజ్ చూడాలనుకున్నా.. అది ఏంటో యాప్ ఓపెన్ చేయకుండానే చూడవచ్చు.

WhatsApp Update: వాట్సప్‌లో మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్, త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న మెటా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్  

యాప్‌ చాట్ ఓపెన్ చేయకుండా వాట్సాప్ మెసేజ్‌లను చదవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. మీరు వాట్సాప్ మెసేజ్ చదివిన విషయం పంపినవారికి తెలియకుండా జాగ్రత్త పడొచ్చు. మీరు అలాంటి వారిలో ఒకరు అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు వాట్సాప్ ఫుల్ మెసేజ్ చదివిన విషయం పంపినవారికి తెలియదు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వాట్సాప్ ట్రిక్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.

Pesky Messages in WhatsApp: వాట్సప్ లో అశ్లీల మెసేజ్‌లు, భారతీయులే ఎక్కువగా పొందుతున్నారని తెలిపిన కొత్త నివేదిక 

వాట్సాప్ ఓపెన్ చేయకుండానే ఫుల్ మెసేజ్ చదవడం ఎలా? 

ఈ ప్రాసెస్ పెద్ద కష్టమేమీ కాదు. కేవలం ఒక నిమిషం సమయం మాత్రమే పడుతుంది. ఈ ట్రిక్ చాలా సులభంగా పనిచేస్తుంది. ఇంతకీ.. మీ ఫోన్‌లో విడ్జెట్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవచ్చు. మెసేజింగ్ యాప్‌ను ఓపెన్ చేయకుండానే మీరు పూర్తి WhatsApp మెసేజ్‌లను ఇలా చదవవచ్చు.

1. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు ముందుగా మెయిన్ స్క్రీన్ హోమ్‌పేజీపై ఎక్కువసేపు వేలితో Tap చేసి పట్టుకోవాలి.

2. ఇప్పుడు, విడ్జెట్‌లపై Tap చేయండి. మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై అన్ని విడ్జెట్‌లను డిస్‌ప్లే చేస్తుంది.

3. మీరు WhatsApp విడ్జెట్‌ను గుర్తించే వరకు కిందికి స్క్రోల్ చేస్తూ ఉండండి.

4. WhatsApp విడ్జెట్‌పై Tap చేయండి.

5. అది మీ హోమ్‌పేజీకి యాడ్ అవుతుంది.

6. మీరు క్లీన్ హోమ్‌పేజీ స్క్రీన్ ఇంటర్‌ఫేస్‌ పొందేవరకు వాట్సాప్ విడ్జెట్‌పై ఎక్కువసేపు నొక్కి పట్టుకోండి. ఆపై కుడి వైపునకు డ్రాగ్ చేయొచ్చు.

7. Done బటన్‌పై Tap చేయండి.

8. విడ్జెట్‌ని ఎక్కువసేపు Tap చేసి పైభాగానికి మార్చండి.

9. అప్పుడు మీరు వాట్సాప్ విడ్జెట్‌ లాంగ్ ఆప్షన్ పొందవచ్చు. ఆ విడ్జెట్ పూర్తి స్క్రీన్‌కు పొడిగించవచ్చు.

10. వాట్సాప్ ఫుల్ మెసేజ్‌లను చాలా సులభంగా చదవచ్చు.

యాప్ ఓపెన్ చేయకుండా అన్ని WhatsApp మెసేజ్‌లు ఎలా చదవాలంటే? :

మీరు హోమ్‌పేజీలలో ఒకదానిలో వాట్సాప్ విడ్జెట్‌ను విజయవంతంగా సెటప్ చేసుకోవాలి. మీరు అన్ని మెసేజ్‌లను చదవడానికి కిందికి స్క్రోల్ చేయాలి. యాప్‌లోని చాట్‌ ప్రకారం.. అన్ని మెసేజ్‌లు ఒకే లైనులో కనిపిస్తాయి. లేటెస్ట్ మెసేజ్ పైన ఉంటుంది. మీరు చదవని అంతకుముందు మెసేజలన్నీ దాని కింద కనిపిస్తాయి.

Paytm UPI LITE: దూసుకుపోతున్న పేటీఎం యూపీఐ లైట్, పీక్ ట్రాన్సాక్షన్ సమయాల్లో ఎప్పుడూ విఫలం కాలేదని తెలిపిన కంపెనీ 

ఇలా అసలు చేయొద్దు 

మీరు మీ ఫోన్‌లోని వాట్సాప్ విడ్జెట్‌లో ఏదైనా మెసేజ్‌లను నొక్కడం చేయరాదు. ఎందుకంటే.. వాట్సాప్‌లో చాట్‌ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు వాట్సాప్ మెసేజ్‌లను రిసీవర్ చదివినట్లు చూపిస్తుంది. బ్లూ టిక్స్ వస్తాయి. మీరు చదివిన విషయం పంపినవారికి వెంటనే తెలిసిపోతుంది.