ITR Filing: ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో సరికొత్త రికార్డు, ఏకంగా 7 కోట్లు దాటిన ఐటీఆర్ ఫైలింగ్స్
ఆదాయపు పన్ను రిటర్నులు (ITR filing) దాఖలు చేసేందుకు పన్ను చెల్లింపుదారులు (IT Returns) పోటెత్తారు. జులై 31వ తేదీ ఒక్కరోజే సాయంత్రం ఏడు గంటలవరకు ఏకంగా 50 లక్షల మంది రిటర్నులు దాఖలు చేశారని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ( IT Department) తెలిపింది.
Mumbai, July 31: నేటితో గడువు పూర్తికానుండటంతో.. ఆదాయపు పన్ను రిటర్నులు (ITR filing) దాఖలు చేసేందుకు పన్ను చెల్లింపుదారులు (IT Returns) పోటెత్తారు. జులై 31వ తేదీ ఒక్కరోజే సాయంత్రం ఏడు గంటలవరకు ఏకంగా 50 లక్షల మంది రిటర్నులు దాఖలు చేశారని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ( IT Department) తెలిపింది. ప్రస్తుత మదింపు సంవత్సరంలో ఇప్పటి వరకు 7 కోట్లకుపైగా రిటర్నులు దాఖలైనట్లు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.
గడువు ముగియనున్న నేపథ్యంలో ఇ-ఫైలింగ్ పోర్టల్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఐటీ శాఖ తెలిపింది. ఐటీఆర్ ఫైలింగ్, పన్ను చెల్లింపు, ఇతర సేవల్లో సాయం చేసేందుకు.. హెల్ప్‌డెస్క్, లైవ్ చాట్‌లు, సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యం అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా.. గత ఏడాది మొత్తం 8.61 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి.