Smartphone Prices May Rise: మొబైల్ యూజర్లకు షాక్, స్మార్ట్‌ఫోన్ల ధరలు 3 శాతం పెరిగే అవకాశం, డిస్‌ప్లేల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం విధించిన 10 శాతం సుంకమే కారణం, ఆందోళన వ్యక్తం చేసిన ఐసీఈఏ

మొబైల్ అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ లాంటి వార్తే.. కేంద్ర ప్రభుత్వం డిస్‌ప్లేల దిగుమతిపై 1 శాతం సుంకం విధించిన నేపథ్యంలో మొబైల్‌ ఫోన్ల ధరలు 3శాతం దాకా పెరిగే అవకాశం (Smartphone Prices May Rise) ఉంది. ఈ విషయంపై ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ICEA) ఆందోళన వ్యక్తం చేసింది. యాపిల్, హువాయి, షియోమి, వివో, విన్‌స్ట్రాన్‌ వంటి సంస్థలకు ఇందులో సభ్యత్వం ఉందని,ఈ నేపథ్యంలో మొబైల్‌ ఫోన్ల (SmartPhones) రేట్లపై 1.5-3 శాతం దాకా సుంకాల ప్రభావం ఉంటుంది‘ అని ఐసీఈఏ నేషనల్‌ చైర్మన్‌ పంకజ్‌ మహీంద్రూ ఒక ప్రకటనలో తెలిపారు.

mobile using (Photo-ANI)

మొబైల్ అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ లాంటి వార్తే.. కేంద్ర ప్రభుత్వం డిస్‌ప్లేల దిగుమతిపై 10 శాతం సుంకం విధించిన నేపథ్యంలో మొబైల్‌ ఫోన్ల ధరలు 3శాతం దాకా పెరిగే అవకాశం (Smartphone Prices May Rise) ఉంది. ఈ విషయంపై ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ICEA) ఆందోళన వ్యక్తం చేసింది. యాపిల్, హువాయి, షియోమి, వివో, విన్‌స్ట్రాన్‌ వంటి సంస్థలకు ఇందులో సభ్యత్వం ఉందని,ఈ నేపథ్యంలో మొబైల్‌ ఫోన్ల (SmartPhones) రేట్లపై 1.5-3 శాతం దాకా సుంకాల ప్రభావం ఉంటుంది‘ అని ఐసీఈఏ నేషనల్‌ చైర్మన్‌ పంకజ్‌ మహీంద్రూ ఒక ప్రకటనలో తెలిపారు.

దేశీయంగా ఉత్పత్తి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని, అయితే ప్రస్తుతం దిగుమతులను తగ్గించుకోవడం మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా మార్కెట్‌ వాటాను కూడా పెంచుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా దశలవారీగా తయారీని ప్రోత్సహించే కార్యక్రమంలో (PMP) భాగంగా డిస్‌ప్లే అసెంబ్లీ, టచ్‌ ప్యానెళ్లపై (display, touch panels) అక్టోబర్‌ 1 నుంచి దిగుమతి సుంకాలను అమలు చేయాలని 2016లోనే కేంద్రం నిర్ణయించింది.

వాట్సాప్‌లోకి కొత్త ఫీచర్లు, ఆల్వేస్‌ మ్యూట్‌ బటన్‌, కొత్తగా 138 ఎమోజీలు, న్యూ అటాచ్‌మెంట్‌ ఐకాన్స్‌..ఇతర ఫీచర్లు మీకోసం

దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, దేశీయంగా తయారీ పెంచుకునేందుకు వీలుగా ప్రభుత్వం పీఎంపీని తెరపైకి తెచ్చింది. వేదాంత గ్రూప్‌ చైర్మన్‌ వల్కన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సంస్థ సుమారు రూ. 68,000 కోట్ల పెట్టుబడితో 2016లో ట్విన్‌స్టార్‌ డిస్‌ప్లే టెక్నాలజీస్‌ పేరుతో దేశీయంగా తొలి ఎల్‌సీడీ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అయితే, ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో ఆ ప్రాజెక్టు ఇంకా మొదలుకాలేదు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement