WhatsApp Text Bomb: వాట్స్‌యాప్‌లోకి భయంకరమైన వైరస్, యూజర్లకి టెక్ట్స్ బాంబ్ సందేశాలు, ఓపెన్ చేస్తే ఫోన్ క్రాష్, అలర్ట్‌గా ఉండాలని సూచించిన వాబీటా ఇన్ఫో
దీనిపై బ్రెజిల్ హ్యాకర్లు దాడి చేశారని వార్తలు వస్తున్నాయి. టెక్ట్స్ బాంబ్ గా పిలిచే స్కేరీ మెసేజ్ వైరస్ వాట్సాప్ నెట్ వర్క్ మీద దాడి (new text bomb) చేసినట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాబీటా ఇన్ఫో తెలిపింది. ఆగస్టు మధ్యలో ఈ వైరస్ మొదలైందని ఇప్పుడు ప్రపంచదేశాలకు ఇది విస్తరించిందని వాబీటా ఇన్ఫో తెలిపింది. కొద్ది రోజుల క్రితం వాట్స్‌యాప్ ఓఎస్ ఆండ్రాయిడ్ ఫ్లాట్ పాం మీద కొత్త ఫీచర్లు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో యూజర్లు చెప్పాలని వాబీటా ఇన్ఫో కోరింది.
ప్రపంచంలో అత్యంత పాపులర్ మెసేంజిగ్ యాప్ వాట్స్‌యాప్ హ్యాకింగ్ (WhatsApp crash) భారీన చిక్కుకుంది. దీనిపై బ్రెజిల్ హ్యాకర్లు దాడి చేశారని వార్తలు వస్తున్నాయి. టెక్ట్స్ బాంబ్ గా పిలిచే స్కేరీ మెసేజ్ వైరస్ వాట్సాప్ నెట్ వర్క్ మీద దాడి (new text bomb) చేసినట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాబీటా ఇన్ఫో తెలిపింది. ఆగస్టు మధ్యలో ఈ వైరస్ మొదలైందని ఇప్పుడు ప్రపంచదేశాలకు ఇది విస్తరించిందని వాబీటా ఇన్ఫో తెలిపింది. కొద్ది రోజుల క్రితం వాట్స్‌యాప్ ఓఎస్ ఆండ్రాయిడ్ ఫ్లాట్ పాం మీద కొత్త ఫీచర్లు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో యూజర్లు చెప్పాలని వాబీటా ఇన్ఫో కోరింది.
అందులో ఒక యూజర్ తనకు టెక్ట్స్ బాంబ్ మెసేజ్ లు (WhatsApp Text Bomb) వస్తున్నాయని తెలిపాడు. దీనిపై వాబీటా స్పందిస్తూ.. కొద్ది వారాల క్రితమే దీని గురించి మే చెప్పాం. మా ఫాలోవర్స్ కొందమంది దీన్ని బినారియో, కాంటాక్ట్స్ బాంబ్, ట్రావా జాప్, క్రాషర్స్, వికార్డ్ క్రాష్, టెక్ట్స్ బాంబ్ అని పిలుస్తారని తెలిపింది. దీని గురించి వివరించడం కష్టమని యూజర్ సందేశం తెరిచిన ప్రతిసారీ వాట్సాప్ క్రాఫ్ అవుతుందని తెలిపింది.
WABetaInfo Tweets
ఎలాంటి అర్థం లేని కొన్ని స్పెషల్ క్యారక్టర్లను వరుస క్రమంలో ఉంచి ఎదైనా సందేశం రూపంలో దాన్ని యూజర్లకు పంపుతారు. దానిని రిసీవ్ చేసుకున్న యూజర్ అది క్లిక్ చేయగానే వాట్సాప్ క్రాష్ అవుతుంది. దాన్ని క్లోజ్ చేసి తిరిగి ఓపెన్ చేస్తే ఫోన్ క్రాష్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దీన్ని టెక్ట్స్ బాంబ్ గా పిలుస్తారు. ఇప్పటివరకు దీనికి ఎలాంటి తాత్కాలిక పరిష్కారం కనుగొనలేదని వాటాబీ తెలిపింది. ప్రస్తుతానికి యూజర్లు ఇటువంటి వాటి నుంచి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త ఓఎస్ లో ఈ సమస్యలను ఎదుర్కునే విధంగా మార్పులు చేసి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. యూజర్స్ తమ వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.
వాట్సాప్‌లోకి 5 కొత్త ఫీచర్లు, త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి
మీ నంబర్ అపరిచిత వ్యక్తులు గ్రూపులో యాడ్ చేయకుండా ఉండాలంటే మీరు సెక్యూరిటీ ఫీచర్ ను ఎంచుకోండి. ఇందుకోసం సెట్టింగ్స్ లో కెళ్లి అక్కడ కనిపించే ప్రైవసీ మీద క్లిక్ చేస్తే అందులో గ్రూప్ అని ఆప్సన్ కనిపిస్తుంది. అందులో మీరు మీకు నచ్చిన ఆప్సన్ ఎంచుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చు.