Mumbai, June 9: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో మరో ఐదు వినూత్న ఫీచర్లను (Upcoming WhatsApp features) అందుబాటులోకి తీసుకురానుంది.ఇప్పటికే డార్క్ మోడ్ ఫీచర్‌ను లాంఛ్ చేసిన వాట్సాప్ గ్రూప్ వాయిస్, వీడియో కాల్ పరిమితిని నలుగురి నుంచి ఎనిమిదికి పెంచి యూజర్లను ఆకట్టుకుంది. మల్టిపుల్ డివైజ్ సపోర్ట్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ (WhatsApp) కసరత్తు ముమ్మరం చేసింది. తెల్లారేదాక పబ్‌జీ ఆడాడు, తరువాత ఉరేసుకున్నాడు, రాజస్థాన్‌లో విషాదకర ఘటన, కేసు నమోదు చేసిన కోట పోలీసులు
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఒకే సమయంలో ఒక డివైజ్ కంటే పలు డివైజ్‌ల్లో తమ వాట్సాప్ ఖాతాలోకి యూజర్లు లాగిన్ అయ్యే వెసులుబాటు కలుగుతుంది. మరో నూతన ఫీచర్ క్యూఆర్ కోడ్‌పై వాట్పాప్ చురుకుగా పనిచేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్ కేవలం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా నూతన కాంటాక్ట్స్‌ను యాడ్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు.
అయిదు ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే..
Multiple device support
వాట్సాప్ నెలల తరబడి బహుళ పరికర మద్దతును పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ ప్రారంభించిన తర్వాత వినియోగదారులు ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పరికరాల్లో వారి వాట్సాప్ ఖాతాకు లాగిన్ అవ్వడానికి అనుమతిస్తుంది. ప్రస్తుతం, వినియోగదారులు ఒకే పరికరంలో వారి వాట్సాప్ ఖాతాకు లాగిన్ అవ్వవచ్చు. అదే ఖాతా మరొక పరికరంలోకి లాగిన్ అయిన తర్వాత, అది స్వయంచాలకంగా మొదటి పరికరం నుండి లాగ్ అవుట్ అవుతుంది.
WhatsApp QR code
నూతన ఫీచర్ క్యూఆర్ కోడ్‌పై వాట్పాప్ చురుకుగా పనిచేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్ కేవలం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా నూతన కాంటాక్ట్స్‌ను యాడ్ చేసుకోవచ్చు.
Self-destructing messages
ఇది చాలా కాలం నుండి పనిలో ఉన్న మరో లక్షణం. వాట్సాప్ స్టోరీస్ లేదా స్థితి 24 గంటల తర్వాత అదృశ్యమైనట్లే, వినియోగదారులు నిర్ణీత కాల వ్యవధి తర్వాత స్వయంచాలకంగా అదృశ్యమయ్యే సందేశాలను పంపగలరు. స్వీయ-నాశనం లేదా మాయమైన సందేశాల లక్షణం సందేశాలను తొలగించు అని పేరు మార్చబడింది మరియు ఇది త్వరలోనే స్థిరమైన సంస్కరణకు వస్తుందని భావిస్తున్నారు.
In-app browser
ఇన్-యాప్ బ్రౌజర్ ఫీచర్‌పై మెసేజింగ్ యాప్ కసరత్తు చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు చాట్స్‌లో వచ్చిన లింక్స్‌ను వెబ్ బ్రౌజర్‌కు రీడైరెక్ట్ చేయకుండానే నేరుగా ఓపెన్ అయ్యేలా ఈ ఫీచర్ వెసులుబాటు కల్పిస్తుంది.
Last seen for select friends
ఎంపిక చేసిన ఫ్రెండ్స్‌కు లాస్ట్ సీన్ ఆప్షన్‌ను అందుబాటులోకి తేనుంది. వాట్సాప్ ప్రస్తుతం తమ లాస్ట్ సీన్ స్టేటస్‌ను కాంటాక్ట్స్‌లో ప్రతిఒక్కరికీ అనుమతించడం లేదా ఏ ఒక్కరికీ అనుమతించకపోవడం అమలు చేస్తోంది. తాజా ఫీచర్‌తో ఎంపిక చేసిన ఫ్రెండ్స్‌తోనే లాస్ట్ సీన్ స్టేటస్‌ను పంచుకునే వెసులుబాటు కల్పిస్తోంది.