Ola: క్విక్ కామర్స్ వ్యాపారంలోకి మళ్లీ ఓలా రీ ఎంట్రీ, డార్క్‌స్టోర్స్ ఏర్పాట్లు చేసుకునే పనిలో పడిన రైడ్ దిగ్గజం, ఈ సంస్థలకు గట్టి పోటీనిచ్చే అవకాశం
మరోసారి రీఎంట్రీ ఇచ్చేందుకు సమాయత్తం అవుతోంది. ఇందుకోసం సొంతంగా డార్క్ స్టోర్లను (చిన్నపాటి గోదాములు) ఏర్పాటు చేయాలని ఓలా మాతృ సంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్ భావిస్తున్నట్లు సమాచారం.
గతంలో క్విక్ కామర్స్ (quick commerce) విభాగంలో అడుగపెట్టి అర్ధంతరంగా వైదొలగిన ఓలా తాజాగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. మరోసారి రీఎంట్రీ ఇచ్చేందుకు సమాయత్తం అవుతోంది. ఇందుకోసం సొంతంగా డార్క్ స్టోర్లను (చిన్నపాటి గోదాములు) ఏర్పాటు చేయాలని ఓలా మాతృ సంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్ భావిస్తున్నట్లు సమాచారం. వినియోగదారుల నుంచి ఆర్డర్ రాగానే ఆయా డార్క్‌స్టోర్స్ నుంచి ఇంటికి నేరుగా డెలివరీ చేస్తారు. ఆర్డర్ తీసుకోవడం దగ్గర నుంచి డెలివరీ చేయడం వరకు అన్ని క్షణాల్లో జరిగిపోతాయి. ప్రస్తుతం 10 నిమిషాల డెలివరీ పేరిట పాపులర్ అయిన ఈ సేవలను అనేక సంస్థలు అందిస్తున్నాయి. ఆర్బీఐ కీలక అప్‌డేట్, యూపీఐ ద్వారా పన్ను చెల్లింపు పరిమితి రూ.1 లక్ష నుండి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటన
ఆగస్టు 15న ఆ కంపెనీ నిర్వహించే వార్షిక సమావేశంలో దీనిపై ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది.గతంలో ఓలా డ్యాష్ పేరిట ఇ-కామర్స్ సేవలను అందించింది. 2022లో ఆ వ్యాపారాన్ని మూసివేసింది. దీంతోపాటు ఓలా సొంతంగా యూపీఐ సేవలను కూడా ప్రారంభించాలనుకుంటోందని సమాచారం. ఇప్పటికే ఈ విభాగంలో జొమాటోకు చెందిన బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటివి దూసుకెళ్తున్నాయి. టాటాలకు చెందిన బిగ్‌బాస్కెట్ కూడా ఇందులో పోటీ పడుతుండగా.. ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే ‘మినిట్స్’ పేరిట బెంగళూరులో ఈ సేవలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఓలా కూడా ‘క్విక్ కామర్స్’లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.