OnePlus 12R- Genshin Impact Edition: ప్రత్యేక ఎడిషన్‌లో పాత స్మార్ట్‌ఫోన్.. వన్‌ప్లస్ 12Rకు ఆకర్షణీయమైన 'జెన్‌షిన్ ఇంపాక్ట్ ఎడిషన్‌' వేరియంట్ విడుదల, ఈ మోడల్ ప్రత్యేకతలు ఏమిటి? దీని ధర ఎంతో ఇక్కడ తెలుసుకోండి!

OnePlus 12R- Genshin Impact Edition | Pic - OnePlus Official

OnePlus 12R- Genshin Impact Edition: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ 'వన్‌ప్లస్'.. తాజాగా తమ బ్రాండ్ నుంచి ప్రీమియం మోడల్ అయిన OnePlus 12Rకు మరొక ప్రత్యేకమైన వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. OnePlus 12Rలో సరికొత్త 'జెన్‌షిన్ ఇంపాక్ట్ ఎడిషన్‌' ను లాంచ్ చేసింది. ఇది miHoYo అనే జనాదరణ పొందిన మొబైల్ గేమ్ ఆధారంగా రుపొందించినది. ఈ గేమ్ లోని Keqing అనే పాత్ర ద్వారా ప్రేరణ పొందిన అనేక డిజైన్ ఎలిమెంట్లు ఈ ప్రత్యేక ఎడిషన్‌లో అందించారు. OnePlus 12R- Genshin Impact Edition స్మార్ట్‌ఫోన్ కేవలం 'ఎలక్ట్రో వయొలెట్' కలర్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ దిగువన Keqing అని లోగో ఉంటుంది.

ఈ జెన్‌షిన్ ఇంపాక్ట్ ఎడిషన్‌ దాని స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే విభిన్నమైన డిజైన్, UI మార్పులను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 'కేకింగ్ ' థీమ్ గిఫ్ట్ బాక్సులో వస్తుంది. బాక్సు లోపల కస్టమైజ్ చేసిన ఛార్జింగ్ కేబుల్, అడాప్టర్, సిమ్ ట్రే ఉంటుంది. ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టినపుడు ప్రత్యేక ఛార్జింగ్ యానిమేషన్, లైవ్ వాల్‌పేపర్, ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఎలిమెంట్‌లను ప్రదర్శిస్తుంది.

ఇటువంటి డిజైన్ అంశాలు మినహా.. హార్డ్‌వేర్ పరంగా ఈ జెన్‌షిన్ ఇంపాక్ట్ ఎడిషన్‌ పూర్తిగా సాధారణ OnePlus 12R లాగే ఉంటుంది. కానీ ధర మాత్రం రూ. 5 వేలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు గేమింగ్ థీమ్స్ ఇష్టపడేవారైతే, ప్రత్యేకతను కోరుకుంటే ఈ జెన్‌షిన్ ఇంపాక్ట్ ఎడిషన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

OnePlus 12R- Genshin Impact Edition ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ స్పెషల్ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు మార్చి 19 నుండి ప్రారంభమవుతాయి. Amazon, OnePlus.in సహా OnePlus ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.