Realme 5G Smartphone: రూ.7వేలకే 5జీ స్మార్ట్‌‌ఫోన్‌, మొబైల్ మార్కెట్‌కి షాక్ ఇవ్వబోతున్న రియల్‌మీ, దీపావళి ఫెస్టివల్‌ సందర్భంగా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపిన సీఈఓ సీఈవో మాధవ్ సేథ్

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ తయారీ దిగ్గజం రియల్‌ మీ సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది దీపావళి ఫెస్టివల్‌ సందర్భంగా 5జీ స్మార్ట్‌ ఫోన్లను కేవలం రూ.7 వేలకే అందిస్తామని రియల్‌మీ ఇండియా సీఈఓ సీఈవో మాధవ్ సేథ్ ప్రకటించారు. 60 లక్షల ఫోన్లను వినియోగదారులకు అందుబాటులో తీసుకువస్తామని ఆయన తెలిపారు.

Realme Narzo 30, Narzo 5G Smartphones (Photo Credits: Flipkart)

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ తయారీ దిగ్గజం రియల్‌ మీ సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది దీపావళి ఫెస్టివల్‌ సందర్భంగా 5జీ స్మార్ట్‌ ఫోన్లను కేవలం రూ.7 వేలకే అందిస్తామని రియల్‌మీ ఇండియా సీఈఓ సీఈవో మాధవ్ సేథ్ ప్రకటించారు. 60 లక్షల ఫోన్లను వినియోగదారులకు అందుబాటులో తీసుకువస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే మార్కెట్లో రియల్‌ మీ నార్జో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.15,999 ఉండగా.. రాబోయే 5జీ స్మార్ట్‌ ఫోన్‌ రూ.7వేలకే అందిస్తామని (Realme To Launch Rs. 7000 5G Smartphone) ప్రకటన చేయడం మొబైల్ మార్కెట్లో సంచలనం రేపుతోంది.

గ్లోబల్‌ 5జీ సమ్మిట్‌ వేదికగా మాధవ్‌ సేథ్‌ మాట్లాడుతూ " రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ ప్రకారం ఇండియాలో 90 శాతం మంది 5జీ టెక్నాలజీ వైపు మొగ్గుచూపుతున్నారు. అందరికి కంటే ముందుగా మేము తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి తెచ్చి సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్‌ చేస్తాం. ఇతర 5జీ స్మార్ట్‌ఫోన్‌ (Realme 5G Smartphone) సంస్థల కంటే ముందుగా 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను తక్కువ ధరలో అందించాలనే లక్ష్యంతో రియల్‌ మీ పని చేస్తుందని" చెప్పారు.

మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం ఇక చాలా ఈజీ, తెలుగు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా tafcop.dgtelecom.gov.in ను అందుబాటులోకి తీసుకువచ్చిన కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ

ఇదిలా ఉంటే దీపావళి ఫెస్టివల్‌ సందర్భంగా సేల్స్‌ కోసం రియల్‌ మీ 1 + 5 + టి స్ట్రాటజీని అప్లయ్‌ చేయనుంది. ఈ స్ట్రాటజీలో భాగంగా ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్మార్ట్‌వాచ్‌లు, వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్ స్పీకర్లను విడుదల చేసేందుకు రియల్‌ మీ ప్రతినిధులు సిద్ధం చేస్తున్నారు. ఐదు వస‍్తువుల్నికొంటే ఒక స్మార్ట్‌ ఫోన్‌ను ఆఫర్‌గా ఈ సేల్ లో ప్రకటించనుంది. వీటితో పాటు రియల్‌మీకి చెందిన స్మార్ట్ హోమ్ పరికరాలైన గేమ్ కన్సోల్స్‌, కంప్యూటర్ మౌస్‌లు, వాక్యూమ్ క్లీనర్స్, స్కేల్స్, టూత్ బ్రష్లు, సాకెట్లు, బల్బులు, కెమెరాలను విడుదల చేయనుండగా.. ఈ ఏడాది నవంబర్‌ లో జరిగే దిపావళి పండుగ సందర్భంగా కష్టమర్లను ఆకట్టుకునేందుకు రియల్‌ మీ మరిన్ని ఆఫర్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement