RTGS Payment Update: బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్, ఆర్టీజీఎస్‌ సేవలు 24 గంటల పాటు అందుబాటులో.., డిసెంబర్ నుంచి అమల్లోకి, వివరాలను వెల్లడించిన ఆర్‌బీఐ

నగదు బదిలీ సౌకర్యం రియల్‌టైం గ్రాస్‌ సెటిల్మెంట్‌ (RTGS) (RTGS payment system) వారంలో ప్రతి రోజూ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని ఆర్‌బీఐ (RBI) శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి ఈ వెసులుబాటు అమల్లోకి వస్తుందని కేంద్ర బ్యాంక్‌ వెల్లడించింది.

The Reserve Bank of India (RBI) |

బ్యాంకు ఖాతాదారులకు ఆర్ బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. నగదు బదిలీ సౌకర్యం రియల్‌టైం గ్రాస్‌ సెటిల్మెంట్‌ (RTGS) (RTGS payment system) వారంలో ప్రతి రోజూ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని ఆర్‌బీఐ (RBI) శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి ఈ వెసులుబాటు అమల్లోకి వస్తుందని కేంద్ర బ్యాంక్‌ వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం నెలలో రెండు, నాలుగు శనివారాలు, ఆదివారం మినహా మిగిలిన అన్ని వర్కింగ్‌ డేస్‌లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మనీ ట్రాన్స్‌ఫర్స్‌ (RTGS Fund Transfer System) అందుబాటులో ఉన్నాయి.

2019 డిసెంబర్‌ నుంచి నెఫ్ట్‌ సదుపాయాన్ని ఆర్బీఐ నిరంతరం అందుబాటులోకి తీసుకువచ్చిన క్రమంలో ఈ తాజా ప్రకటన వెలువడింది. నెఫ్ట్‌ వ్యవస్థను (NEFT System) గత ఏడాది డిసెంబర్‌ నుంచి 24x7 అందుబాటులోకి తీసుకువచ్చినప్పటి నుంచి సాఫీగా సాగుతోందని, ఈ నేపథ్యంలో ఇక పెద్ద మొత్తాల బదిలీకి ఉద్దేశించిన ఆర్టీజీఎస్‌ సిస్టం సైతం ఇప్పుడు కస్టమర్లకు వారంలో అన్ని రోజులూ, 24 గంటల పాటు ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి అందుబాటులో ఉంటుందని ఆర్‌బీఐ ప్రకటన పేర్కొంది.

వడ్డీ మాఫీ చేస్తే బ్యాంకింగ్ రంగానికి తీరని నష్టం, రుణ మారటోరియం పరిధిని పొడిగించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం, ఆర్‌బీఐ

ఆర్టీజీఎస్‌ కింద రూ 2 లక్షల నుంచి గరిష్టంగా ఎంత మొత్తమైనా ఒక బ్యాంక్‌ ఖాతా నుంచి మరో బ్యాంక్‌ ఖాతాకు బదలాయించవచ్చు. అయితే ఆర్టీజీఎస్‌ ద్వారా పంపే నగదుపై గరిష్ట పరిమతి లేకున్నా పలు బ్యాంకులు రూ 10 లక్షలను గరిష్ట మొత్తంగా పరిమితి విధించాయి