Samsung Galaxy F15 5G: రూ. 16 వేల బడ్జెట్ ధరలో సామ్‌సంగ్ నుంచి 'గెలాక్సీ ఎఫ్15 5G' అనే మరొక కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల, అయితే ఆ పాత మోడల్‌కు ఇది రీబ్రాండ్ వెర్షన్‌గా చెబుతున్న నిపుణులు, పూర్తి వివరాలు చూడండి!
Samsung Galaxy F15 5G : సౌత్ కొరియా టెక్ దిగ్గజం సామ్‌సంగ్, తాజాగా గెలాక్సీ ఎఫ్15 5G అనే మరొక కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో, Redmi, Realme మరియు Motorola వంటి వాటి నుండి స్మార్ట్‌ఫోన్‌లకు దీటుగా సామ్‌సంగ్ ఈ గెలాక్సీ ఎఫ్15 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధరలు రూ. 16 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి.
Samsung కొత్త హ్యాండ్‌సెట్ తాజా ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా One UI 6లో పనిచేస్తుంది, ఆపై 4 సంవత్సరాల పాటు OS అప్‌డేట్‌లను అందిస్తోంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్15 5G స్మార్ట్‌ఫోన్‌లో రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ ఫోన్ జీ గ్రీన్ మరియు గ్రూవీ వైలెట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే, బ్యాటరీ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. అయితే, ఈ కొత్త ఫోన్ దాదాపు గతేడాది విడుదల చేసిన గెలాక్సీ ఏ15జీ స్మార్ట్‌ఫోన్‌కు రీబ్రాండింగ్ వెర్షన్ లాగే కనిపిస్తుంది. Samsung Galaxy F15 5G లో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏ విధంగా ఉన్నాయో ఈ కింద పరిశీలించండి.
Samsung Galaxy F15 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5-అంగుళాల ఫుల్‌హెచ్‌డి+ సూపర్ AMOLED డిస్‌ప్లే
- 4GB/ 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్
- వెనకవైపు 50MP+5MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 13MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 25W ఫాస్ట్ ఛార్జింగ్
ధరలు: 4GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ. 15,999/-
6GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ రూ 16,999/-. ధరలు ఇలా ఉంటే దీని బాక్సులో ఛార్జింగ్ అడాప్టర్ ఇవ్వడం లేదు. కాబట్టి వినియోగదారులు ఛార్జర్ కోరుకుంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ అలాగే సామ్‌సంగ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయటానికి అందుబాటులో ఉంటుంది.