Samsung Layoffs: వేలాదిమంది ఉద్యోగులను ఇంటికి సాగనంపే పనిలో శాంసంగ్, మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం మంది సిబ్బందిని తీసేస్తున్నట్లుగా వార్తలు

మొత్తం ఉద్యోగుల్లో పదిశాతం మందిపై వేటు వేసేందుకు శాంసంగ్ రెడీ అవుతున్నట్లు ‘బ్లూమ్‌బర్గ్’ తెలిపింది.

Samsung (Credits: X)

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్  ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. మొత్తం ఉద్యోగుల్లో పదిశాతం మందిపై వేటు వేసేందుకు శాంసంగ్ రెడీ  అవుతున్నట్లు ‘బ్లూమ్‌బర్గ్’ తెలిపింది. శాంసంగ్‌లో మొత్తం 2,67,800 మంది ఉద్యోగులుండగా విదేశాల్లో శాంసంగ్‌కు దాదాపు 1.47 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సొంత దేశంలో కాకుండా విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపైనే వేటుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.

సింగపూర్‌ కంపెనీలోని హెచ్ఆర్ మేనేజర్లు ఇప్పటికే ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి లేఆఫ్‌ల ప్రకటన చేశారు. అలాగే, ఈ సందర్భంగా ఇవ్వబోయే ప్యాకేజీల గురించి కూడా వెల్లడించినట్టు తెలిసింది. అయితే, తప్పనిసరిగా పలానా విభాగంలోనే ఉద్యోగులను తొలగించాలన్న నియమం పెట్టుకోలేదని శాంసంగ్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

అతి వాడకంతో చేజారిన పరిస్థితి.. యాంటీ బయోటిక్స్‌ పనిచేయని దుస్థితి.. ఐసీఎంఆర్‌ తాజా నివేదిక

శాంసంగ్ ఈ ఏడాది భారీ ఒడుదొడుకులకు లోనవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద మెమరీ చిప్స్, స్మార్ట్‌ఫోన్ మేకర్ అయిన శాంసంగ్ షేర్లు ఈ ఏడాది 20 శాతానికిపైగా పతనమయ్యాయి. శాంసంగ్ గతంలోనూ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించింది. ఇండియా, లాటిన్ అమెరికాలో 10 శాతం సిబ్బందిని ఇంటికి పంపింది. ఇప్పుడు విదేశాల్లో పనిచేస్తున్న 1.47 లక్షల మందిలో మరో 10 శాతం మందిని ఇంటికి పంపాలని నిర్ణయించింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif