SBI Debit Card: మీ ఎస్‌బీఐ డెబిట్ కార్డు పోయిందా, బ్లాక్ చేసి కొత్త కార్డు పొందడం ఎలాగో తెలుసుకోండి, కొత్త డెబిట్ కార్డుని పొందే ప్రక్రియను సులభతరం చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఎస్బీఐ (State Bank of India) వినియోగదారుల డెబిట్ కార్డు పోతే బ్లాక్ చేయడం, అలాగే దాన్ని (SBI Debit Card block and replacement) తిరిగి పొందవచ్చు.

State Bank of India (Photo Credits: PTI)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అకౌంట్ ఉందా..అయితే ఏటీఎం కూడా మీ దగ్గర ఉన్నట్లే..ఈ ఏటీఎంను ఎవరైనా దొంగిలించినా లేకుంటే పోగొట్టుకున్నా దాన్ని వెంటనే బ్లాక్ చేయాలి..లేకుంటే మీ అకౌంట్లో డబ్బులు పోవడం ఖాయం. ఈ ప్రాసెస్ చాలామందికి తెలియదు.. అయితే పోగొట్టుకున్న డెబిట్ కార్డును (SBI Debit Card) బ్లాక్ చేయడం, అలాగే కొత్త డెబిట్ కార్డుని పొందే ప్రక్రియను సులభతరం చేసింది. ఎస్బీఐ (State Bank of India) వినియోగదారుల డెబిట్ కార్డు పోతే బ్లాక్ చేయడం, అలాగే దాన్ని (SBI Debit Card block and replacement) తిరిగి పొందవచ్చు.

అంతేకాదు పోగొట్టుకున్న డెబిట్ కార్డును ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) ద్వారా బ్లాక్ చేయవచ్చు. లేదా ఫోన్ కాల్ ద్వారా కూడా బ్లాక్ చేయవచ్చు. మీకు ఆన్ లైన్ అకౌంట్ ఉంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా బ్లాక్ చేయవచ్చు. యోనో యాప్ ద్వారా కూడా బ్లాక్ చేయవచ్చు. ఎస్బీఐ బ్యాంకు కస్టమర్లు 1800 112 211 కు లేదా 1800 425 3800కు ఫోన్ కాల్ చేయడం ద్వారా పోగొట్టుకున్న కార్డును బ్లాక్ చేయవచ్చు. ఎస్బీఐ అకౌంట్‌కు లింక్ ఉన్న మీ రిజిస్టర్డ్ మొబైల్ ద్వారా బ్లాక్ చేయవచ్చు. ఆ నంబర్లకు ఫోన్ చేసినప్పుడు తగు సూచనలతో దాన్ని బ్లాక్ చేయాల్సి ఉంటుంది.

కేంద్రం నుండి రూ. 15 లక్షలు గెలుచుకునే అవకాశం, మీరు చేయవలిసిందల్లా పేరు, ట్యాగ్‌లైన్‌, లోగోను సూచించడమే, పోటీకి సంబంధించిన వివరాలను MyGovIndia ట్విట్టర్లో పొందుపరిచిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

మీ రిజిస్టర్ మొబైల్ నుండి కాల్ చేసిన తరువాత మీ కార్డును బ్లాక్ చేయడానికి ‘0’ను ఎంటర్ చేయాలి.

ప్రాసెస్ కంటిన్యూ చేయడం కోసం 1 లేదా 2 ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

రిజిస్టర్డ్ మొబైల్ ద్వారా, కార్డ్ నెంబర్ ద్వారా ఎస్బీఐ డెబిట్ కార్డును బ్లాక్ చేయవచ్చు. ఇందుకు ఆప్షన్ 1ను ఎంచుకోవాలి.

రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా, అకౌంట్ ద్వారా బ్లాక్ చేయడం కోసం ఆప్షన్ 2ను ఎంచుకోవాలి.

అకౌంట్ చివరి 5 అంకెలను నమోదు చేసి, ఆ తర్వాత 1ని ఎంటర్ చేసి నిర్ధారించాలి.

మీరు ఆప్షన్ 1ను ఎంచుకుంటే కనుక కార్డు చివరి 5 అంకెలు నమోదు చేయాలి. ఆ తర్వాత 1తో నిర్ధారించాలి. ఆ తర్వాత 2 ను ఎంటర్ చేస్తే ఎస్బీఐ కార్డు చివరి 5 అంకెలను నమోదు చేయాలి. మీ డెబిట్ కార్డు బ్లాక్ చేసినట్లు ఎస్సెమ్మెస్ వస్తుంది.

కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం, ఆగస్టు 31 వరకు కోవిడ్ గైడ్‌లైన్స్ పొడింగింపు, అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, కరోనా నియమాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు

మీరు కొత్త డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేయాలనుకుంటే దాన్ని నిర్ధారించడానికి కాల్ చేసిన తరువాత 1 నొక్కండి, మునుపటి మెనూకు వెళ్లడానికి 7 నొక్కండి లేదా ప్రధాన మెనూకు వెళ్లడానికి 8 నొక్కండి.కొత్త కార్డు కోసం దరఖాస్తు చేయడానికి కస్టమర్ ‘1’ ఎంచుకుంటే, అతను అతని / ఆమె పుట్టిన తేదీని నమోదు చేయాలి. ఆ తర్వాత మీరు 1 నొక్కవలిసి ఉంటుంది.

తర్వాత RMN (రిజిస్టర్డ్ మొబైల్ నంబర్) + కార్డ్ నంబర్. డెబిట్ కార్డు మీ రిజిస్టర్డ్ మొబైల్ చిరునామాకు పంపబడుతుంది. అలాగే కార్డ్ రీప్లేస్ మెంట్ ఛార్జీలు వర్తించబడతాయి. నిర్ధారించడానికి 1 నొక్కండి మరియు అభ్యర్థనను రద్దు చేయడానికి 2 నొక్కండి. మీ SBI డెబిట్ కార్డు రీప్లేస్‌మెంట్ అభ్యర్థన విజయవంతంగా పంపబడిందని మెసేజ్ వస్తుంది. ఖచ్చితంగా తెలుసుకోవడానికి మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్‌కు SMS ద్వారా పంపిన SBI ద్వారా నిర్ధారణను తనిఖీ చేయవచ్చు.