Junk Food-Stress Link: ఒత్తిడి ఉన్నప్పుడు జంక్ ఫుడ్ తింటున్నారా? అయితే, మీ ఆందోళన మరింత పెరుగుతుంది.. జాగ్రత్త మరి..!
ఒత్తిడి సమయంలో వీటిని మరింత ఎక్కువగా తింటే ఆందోళన మరింత పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో అధ్యయనంలో తేలింది.
Hyderabad, June 18: సమోసా (Samosa), పిజ్జా, బర్గర్ లాంటి జంక్ ఫుడ్ (Junk Food) అంటే మీకు ఇష్టమా? ఒత్తిడిలో ఉన్న సమయంలో వీటిని మరింతగా లాగిస్తున్నారా? అయితే, జాగ్రత్త.. ఒత్తిడి సమయంలో వీటిని మరింత ఎక్కువగా తింటే ఆందోళన మరింత పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. జంతువులపై జరిపిన అధ్యయనం ప్రకారం.. అధికంగా కొవ్వు కలిగిన జంక్ ఫుడ్ లాంటి ఆహారాన్ని తినడం వల్ల రెసిడెంట్ గట్ బాక్టీరియాకు అంతరాయం కలుగుతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఒత్తిడి, ఆందోళనతో సంబంధమున్న సెరోటోనిన్ ఉత్పత్తి ఇదే సమయంలో ఎక్కువ కావడాన్ని వీళ్లు పరిశీలించారు. ఇది మెదడుపై కూడా ప్రభావం చూపించొచ్చని అంచనా వేశారు.
ఎందుకు సూచిస్తున్నారు?
సాధారణంగా ఒత్తిడిలో ఉన్నవారు ఎక్కువ కెలోరీలున్న ఆహారం తినడానికి మొగ్గు చూపుతారు. అందుకే, ఒత్తిడి ఉన్నప్పుడు జంక్ ఫుడ్ తినడం మంచిది కాదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.