Indian Spices to treat Cancer: మసాలాలతో క్యాన్సర్ కు వైద్యం.. 2028 నాటికి మార్కెట్లోకి ఔషధం.. మద్రాస్ ఐఐటీకి దక్కిన పేటెంట్.. ఇప్పటికే జంతువులపై చేసిన ప్రయోగాలు సక్సెస్
ఈ మేరకు మద్రాస్ ఐఐటీ పరిశోధకులు నిరూపించారు.
Newdelhi, Feb 26: ప్రాణాంతకమైన క్యాన్సర్ (Cancer) వ్యాధిని వంటింట్లో నిత్యం ఉపయోగించే మసాలా దినుసులతో (Indian Spices) నయం చేయొచ్చు. ఈ మేరకు మద్రాస్ ఐఐటీ (Madras IIT) పరిశోధకులు నిరూపించారు. అంతేకాదు దీనిపై తాజాగా పేటెంట్ కూడా పొందారు. 2028 నాటికి ఈ మందును మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జంతువులపై ఈ ఔషధంతో చేసిన ప్రయోగాలు సానుకూల ఫలితాలిచ్చాయి. త్వరలోనే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ చేపట్టనున్నారు.
ఏయే క్యాన్సర్లకు విరుగుడు అంటే?
ఊపిరితిత్తులు, రొమ్ము, పెద్దపేగు, గర్భాశయ, నోటి, థైరాయిడ్ క్యాన్సర్లను మసాలాల నుంచి సేకరించిన నానోమెడిసిన్‌తో నయం చేయవచ్చని ఐఐటీ మద్రాస్ పరిశోధకులు చెబుతున్నారు.