Living Computer: ప్రపంచంలోనే తొలి లివింగ్ కంప్యూటర్.. ఎవరు చేశారు? దీంతో లాభమేంటి??
ఎలక్ట్రానిక్ చిప్ తో కాకుండా మనిషి మెదడు కణజాలంతో ప్రపంచంలోనే తొలి ‘లివింగ్ కంప్యూటర్’ను తయారుచేసి స్విట్జర్లాండ్ కు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికారు.
Newdelhi, June 10: ఎలక్ట్రానిక్ చిప్ (Electronic Chip) తో కాకుండా మనిషి మెదడు (Brain) కణజాలంతో ప్రపంచంలోనే తొలి ‘లివింగ్ కంప్యూటర్’ను (Living Computer) తయారుచేసి స్విట్జర్లాండ్ కు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. ఫైనల్ స్పార్క్ అనే ఓ స్టార్టప్ కంపెనీకి చెందిన ఈ పరిశోధకులు ‘బ్రెయినోవేర్’ అనే కొత్త కంప్యూటర్ ను అభివృద్ధి చేశారు. మానవ మెదడులోని న్యూరాన్లు, కంప్యూటర్ హార్డ్ వేర్ ను కలిపి దీన్ని సృష్టించారు.
లాభం ఏమిటంటే?
ప్రస్తుతం వినియోగిస్తున్న డిజిటల్ ప్రాసెసర్లతో పోలిస్తే దాదాపు 10 లక్షల రెట్లు తక్కువ విద్యుత్తును ఉపయోగించుకోవడం లివింగ్ కంప్యూటర్ ప్రత్యేకత అని వెల్లడించారు.