WhatsApp Scam: వాట్సాప్ గ్రూపులో వచ్చే పీఎం కిసాన్ యాప్ లింక్ ఓపెన్ చేయకండి, మీ ఫోన్ హ్యాక్ అవుతుందని హెచ్చరిస్తున్న పోలీసులు
ఆ తర్వాత కాసేపటికే తమ ఫోన్లలో వాట్సాప్ పనిచేయడంలేదని బాధితులు వాపోతున్నారు. తమ పేరుతో, తాము పంపినట్లే ఎవరెవరికో సందేశాలు వెళుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోంపెల్లి గ్రామంలో పదిమంది వాట్సాప్ ఖాతాలు హ్యాకింగ్ కు గురవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు
నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం సోంపెల్లి గ్రామంలో దాదాపు పదిమంది వాట్సాప్ ఖాతాలు హ్యాక్ అయ్యాయని, వారి పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు సందేశాలు పంపిస్తున్నారని ఇటీవల పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నెల 18న పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇటీవల గ్రామస్థుల వాట్సాప్ గ్రూప్ లోకి పీఎం కిసాన్ యాప్ లింక్ ను కొంతమంది ఫార్వార్డ్ చేశారు. సైబర్ క్రిమినల్స్ ఆట కట్టించేందుకు కేంద్రం కీలక నిర్ణయం, ఇకపై ఎవరు కాల్ చేశారో...ప్రతి ఒక్కరికి తెలిసేలా కొత్త రూల్ తెచ్చిన ట్రాయ్
ఈ నేపథ్యంలోనే పీఎం కిసాన్ డబ్బులు తమ ఖాతాలో పడతాయనే ఉద్దేశంతో రైతులు ఈ లింక్ ను క్లిక్ చేస్తున్నారు. ఆ తర్వాత కాసేపటికే తమ ఫోన్లలో వాట్సాప్ పనిచేయడంలేదని బాధితులు వాపోతున్నారు. తమ పేరుతో, తాము పంపినట్లే ఎవరెవరికో సందేశాలు వెళుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోంపెల్లి గ్రామంలో పదిమంది వాట్సాప్ ఖాతాలు హ్యాకింగ్ కు గురవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయమై సైబర్ క్రైం డీఎస్పీ హసీద్ ఉల్లాను మీడియా సంప్రదించగా.. మొబైల్‌లో వచ్చే యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పీఎం కిసాన్ యాప్ పేరుతో ఏదైనా లింక్ వస్తే ఓపెన్ చేయొద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని చెప్పారు.