Infosys CEO Salil Parekh: ఏఐతో ఉద్యోగాలు పోవు, గుడ్ న్యూస్‌ చెప్పిన ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్, ఏఐ సాంకేతికతపై ప్రత్యేకంగా దృష్టి సారించామని వెల్లడి

ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సలీల్..తమ సంస్థలో కొత్త టెక్నాలజీ కారణంగా ఉద్యోగాల తొలగింపులు ఉండబోవని స్పష్టం చేశారు.ఒకప్పుడు డిజిటల్, క్లౌడ్ టెక్నాలజీలకు ఆధరణ లభించినట్లుగానే ఇప్పుడు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి ఆదరణ వస్తోందన్నారు.

Hyd, Aug 27:  ఐఏ కారణంగా ఇన్ఫోసిస్‌లో ఉద్యోగుల తొలగింపు ఉండదని తెలిపారు సంస్థ సీఈవో సలీల్ పరేఖ్. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సలీల్..తమ సంస్థలో కొత్త టెక్నాలజీ కారణంగా ఉద్యోగాల తొలగింపులు ఉండబోవని స్పష్టం చేశారు.ఒకప్పుడు డిజిటల్, క్లౌడ్ టెక్నాలజీలకు ఆధరణ లభించినట్లుగానే ఇప్పుడు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి ఆదరణ వస్తోందన్నారు.

తమ క్లయింట్లలో చాలా వరకు జనరేటివ్ ఏఐ టెక్నాలజీపై ఆసక్తి చూపిస్తున్నారని ...అందేకే ఏఐ సాంకేతికతపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు. కొత్త టెక్నాలజీ నుంచి ప్రయోజనాలు పొందే కొద్దీ వాటి అమలు వేగవంతమవుతుందన్నారు. ఏఐ కొత్త టెక్నాలజీపై ఇప్పటికే 2.50 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు.  నిరుద్యోగ మహిళలకు గుడ్ న్యూస్, 4,000 మంది మహిళా సాంకేతిక నిపుణులను నియమించుకోనున్న టాటా గ్రూపు 

Here's Tweet:

 మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఉద్యోగులకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇప్పిస్తున్న క్రమంలో ఉద్యోగాల కోతలు ఉంటాయని అనుకోవడం లేదన్నారు. ఏఐ అభివృద్ధి చెందడం వల్ల కొత్త రంగాలు అందుబాటులోకి వస్తాయని, తద్వారా కొత్త కొత్త అవకాశాలూ వస్తాయన్నారు.