WHO on Covid Pandemic: కరోనా మరణాలు తీవ్రంగా పెరిగే అవకాశం, ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌ఓ, ప్రపంచదేశాలు సమిష్టి చర్యలు తీసుకోకపోతే మరణాలు 20 లక్షలకు చేరే అవకాశం ఉందని తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఈ వ్యాధిపై ప్రపంచ దేశాలు సమిష్టి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరణాల సంఖ్య (coronavirus death toll) రెట్టింపు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే కరోనాను కట్టడి చేసేందుకు వాక్సిన్ అవసరం ఇప్పుడు చాలా ఉందని తెలిపారు. సత్వర చర్యలు, వాక్సిన్ రాని పక్షంలో కరోనా మరణాల తీవ్రత పెరుగుతుందని డబ్ల్యూహెచ్‌ఓ (World Health Organization) పేర్కొంది.

World Health Organization (File Photo)

Geneva, Sep 26: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి తీవ్రత రోజు రొజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధికారులు మరోసారి ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ఈ వ్యాధిపై ప్రపంచ దేశాలు సమిష్టి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరణాల సంఖ్య (coronavirus death toll) రెట్టింపు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే కరోనాను కట్టడి చేసేందుకు వాక్సిన్ అవసరం ఇప్పుడు చాలా ఉందని తెలిపారు. సత్వర చర్యలు, వాక్సిన్ రాని పక్షంలో కరోనా మరణాల తీవ్రత పెరుగుతుందని డబ్ల్యూహెచ్‌ఓ (World Health Organization) పేర్కొంది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మరణాలు పది లక్షలకు చేరువయ్యామని, మరింత అప్రతమత్తం కాకుంటే ఈ సంఖ్య 20 లక్షలకు చేరే అవకాశం (Global Death Toll May Hit 2 Million) ఉందని డబ్ల్యూహెచ్‌ఓ ఎమ‌ర్జెన్సీస్‌ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్‌ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ప్రమాదాన్ని ఊహించడానికే కష్టంగా ఉందని, దీన్ని పరిగణనలోకి తీసుకొని సంబంధిత చర్యలు తీసుకోవాలని ర్యాన్ కోరారు.

ఇదిలా ఉంటే కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందన్న వాదనల మధ్య ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ మరోసారి చైనాపై మాటల దాడి చేశారు. కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలు తెలుసు కోవడానికి ప్రపంచ దేశాలు తమ వంతు కృషి చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి మహమ్మారి విజృంభించకుండా, ఏం జరిగిందో అర్థం చేసుకునేందుకు మనం చేయగలిగినదంతా చేయాలని చెప్పారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో మోరిసన్ మాట్లాడుతూ శనివారం ఈవ్యాఖ్యలు చేశారు. కరోనా మూలలపై విచారణ చేస్తేనే మానవాళికి మరో ప్రపంచ మహమ్మారి ముప్పు తప్పుతుందన్నారు.

తాజాగా 85,362 కొత్త కేసులు, దేశంలో 59 లక్షలు దాటిన కోవిడ్ కేసులు, 93,379 మంది కరోనాతో మృతి, ప్రపంచవ్యాప్తంగా 3.24 కోట్లను దాటిన కరోనా కేసులు

టెలికాన్ఫరెన్స్ వీడియో లింక్ ద్వారా ఐరాస్ 75 వ వార్షికోత్సవ సమావేశాల్లో ప్రసగించిన మోరిసన్ ప్రపంచ దేశాలను కరోనా వణికించిందని, మానవాళిని విపత్తులో ముంచిందని వ్యాఖ్యనిచారు. కోవిడ్-19 వైరస్ జెనెటిక్ మూలాన్ని, అది మానవులకు ఎలా వ్యాపించిందో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఎవరు టీకాను కనుగొన్నారో వారు ప్రపంచ దేశాలతో తప్పక పంచుకోవాలని ఇది నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ విషయంలో ఆస్త్రేలియా వాగ్దానం చేస్తోందిని అలాగే అన్ని దేశాలు అలా చేయాలని పిలుపునిచ్చారు.

ఈ ఏడాది ప్రారంభంలో చైనాపై ప్రధాని దాడి తరువాత ఆస్ట్రేలియా చైనా మధ్య సంబంధాలు, వాణిజ్య యుధ్దం సెగలకు మోరిసన్ తాజా వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా విలయాన్ని సృష్టించిన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తరువాత ఆస్ట్రేలియా డ్రాగన్‌ను టార్గెట్ చేసింది. అప్పటి నుండి చైనా ఆస్ట్రేలియాపై వాణిజ్య ఆంక్షలు విధించింది.

రష్యా టీకా తీసుకున్నవారికి జ్వరం, కండరాల నొప్పులు, 21 రోజుల తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి రెండో డోసు టీకా , వెల్లడించిన రష్యా ఆరోగ్య శాఖ

ఇదిలా ఉంటే భారత దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై లాన్సెట్ హెచ్చరికలు చేసింది. కరోనా మహమ్మారి పరిస్థితిపై ప్రభుత్వసానుకూల ధోరణిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) శాస్త్రీయ ఆధారాల నుంచి పక్కకుపోతోందని లాన్సెట్ మెడికల్ జర్నల్ సంపాదకీయంలో పేర్కొంది. ఫలితంగా ప్రజలకు తప్పుడు సంకేతాలు అందడమే కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా వారిని నిరోధిస్తుందని, ఇది మరింత సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరించింది.

చైనాపై ప్రపంచదేశాలు మండిపడుతున్న సమయంలో డ్రాగన్ శుభవార్తను తెలిపింది. ఏడాదికి 100 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్‌ డోసులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ ప్రతినిధి జెంగ్‌ జోంగ్‌వీ శుక్రవారం చెప్పారు. వచ్చే ఏడాది నాటికి ఈ మేరకు ఉత్పత్తి సామర్థ్యం సాధిస్తామని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి తమ ఉత్పత్తి సామర్థ్యం 61 కోట్ల డోసులకు చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్‌ డోసుల తయారీకి చైనా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. కొత్త ఫ్యాక్టరీల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోంది. 2021లో 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను ఉత్పత్తి చేయడమే తమ ధ్యేయమని ఫార్మా దిగ్గజ సంస్థలు ఫైజర్, మోడెర్నా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. టీకా డోసులను తొలుత ఆరోగ్య కార్యకర్తలు, సైనికులకు, వృద్ధులకు అందజేస్తామని జెంగ్‌ జోంగ్‌వీ పేర్కొన్నారు.