Beirut Blast Tragedy: లెబనాన్ కన్నీటి ఘోష, బీరూట్ పేలుళ్లలో 100 మందికి పైగా మరణం, శిథిలాల కింద మరికొందరు.., 3 బిలియన్ డాలర్లకు పైగా నష్టం, సహాయం చేయాలని మిత్రదేశాలను కోరిన ప్రధాని

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని పోర్టు ప్రాంతంలో మంగళవారం సాయంత్రం జరిగిన రెండు భారీ పేలుళ్లు రాజధానిని తీవ్ర విషాదంలోకి (Beirut Blast Tragedy) నెట్టి వేశాయి. భారీ భూకంపం సంభవిస్తే ఏస్థాయిలో విధ్వంసం ఉంటుందో అంతకన్నా ఎక్కువ స్థాయిలో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. పేలుళ్ల ఘటనలో 100 మందికి పైగా మరణించారు. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. భారీ పేలుళ్ల ధాటికి (Beirut Blasts) పెద్ద పెద్ద భవనాలు సైతం నేలమట్టం అయ్యాయి. బీరుట్ గవర్నర్ మార్వాన్ అబౌద్ (Governor Marwan Abboud) ప్రకారం పేలుడు వల్ల 3 బిలియన్ డాలర్లకు పైగా నష్టం (Cost of Damage Tops $3 Billion) వాటిల్లింది.పేలుడు కారణంగా సుమారు 3 లక్షల మంది (3 Lakh Left Homeless) నిరాశ్రయులయ్యారు.

Blast in Beirut claims 10 lives (Photo Credits: Screengrab/Twitter)

Beirut, August 5: లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని పోర్టు ప్రాంతంలో మంగళవారం సాయంత్రం జరిగిన రెండు భారీ పేలుళ్లు రాజధానిని తీవ్ర విషాదంలోకి (Beirut Blast Tragedy) నెట్టి వేశాయి. భారీ భూకంపం సంభవిస్తే ఏస్థాయిలో విధ్వంసం ఉంటుందో అంతకన్నా ఎక్కువ స్థాయిలో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. పేలుళ్ల ఘటనలో 100 మందికి పైగా మరణించారు. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. భారీ పేలుళ్ల ధాటికి (Beirut Blasts) పెద్ద పెద్ద భవనాలు సైతం నేలమట్టం అయ్యాయి. బీరుట్ గవర్నర్ మార్వాన్ అబౌద్ (Governor Marwan Abboud) ప్రకారం పేలుడు వల్ల 3 బిలియన్ డాలర్లకు పైగా నష్టం (Cost of Damage Tops $3 Billion) వాటిల్లింది.పేలుడు కారణంగా సుమారు 3 లక్షల మంది (3 Lakh Left Homeless) నిరాశ్రయులయ్యారు.

ఘోరమైన పేలుళ్ల పర్యవసానాలను అధిగమించడానికి లెబనాన్‌కు సహాయం చేయాలని లెబనీస్ ప్రధాన మంత్రి హసన్ డియాబ్ (PM Hassan Diab) తన దేశ మిత్రదేశాలను కోరారు. ఆగస్టు 5వ తేదీని పేళ్లుళ్లలో మరణించిన వారికి సూచనగా జాతీయ సంతాప దినంగా ప్రధాని ప్రకటించారు. పేలుళ్ల కారణాలు మరియు పరిణామాలపై చర్చించడానికి లెబనీస్ అధ్యక్షుడు మిచెల్ అవాన్ ఉన్నత రక్షణ మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. పేలుడు అంతా క్షణాల్లోనే..నెత్తురోడిన బీరూట్, 78 మంది మృతి, 4 వేల మందికి పైగా గాయాలు, తీవ్ర విచారం వ్యక్తం చేసిన మోదీ, ట్రంప్, బీరూట్‌ని శ్మశాన దిబ్బగా మార్చివేసిన అమోనియం నైట్రేట్‌

అక్కడ ఓడరేవు నుంచి ఇంకా పొగ వస్తూనే ఉన్నది. వీధులన్నీ శిథిలాలు, దెబ్బతిన్న వాహనాలతో నిండిపోయాయి. పరిసర ప్రాంతాల్లో భవనం పైకప్పులు కూడా ఎగిరిపోయాయి. ఈ ప్రమాదంలో 100మందికి పైగా మరణించారని, సుమారు 4వేల మందికి పైగా గాయపడ్డారని లెబనీస్‌ రెడ్‌క్రాస్‌ ప్రతినిధి ఒకరు చెప్పారు. పేలుళ్లకు కారణమేమిటో ఇప్పటి వరకు తెలియలేదు. గాయపడిన వారి సంఖ్య వేలల్లో ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. ఈ పేలుళ్లలో మృతుల్లో అత్యధికులు పోర్ట్‌, కస్టమ్స్‌ ఉద్యోగులే ఉన్నారు.

ఎక్కడిక్కడ భారీ నిర్మణాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. రోడ్లన్ని గాజు పెంకులు, ఇనుప చువ్వలతో నిండి పోయాయి. అపార్ట్‌మెంట్లలోని ప్లాట్స్‌ పూర్తిగా దెబ్బతిన్నాయి. నరమానవుడనే వాడు ప్రస్తుతం ఈ ప్లాట్స్‌లో కనిపించడం లేదు. విధ్వంసానికి సంబంధించిన ఏరియల్‌ ఫూటేజ్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఏనుగుతో పాటు కడుపులో బిడ్డను చంపేశారు, బాణసంచా కూర్చిన పైనాపిల్‌ తిని కేరళలో ఏనుగు మృతి, ఎఫ్‌‌ఐఆర్ నమోదు

ఓడరేవు వద్ద ఓ గిడ్డంగిలో నిల్వ చేసిన 2,700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఒక్కసారిగా పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందని ఆ దేశ అంతర్గత మంత్రి మొహమ్మద్‌ ఫాహ్మి స్థానిక టీవీ ఛానెల్‌తో చెప్పారు. ఈ పేలుడు వల్ల బీరుట్ ఓడరేవు పూర్తిగా ధ్వంసమైంది. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. ఒక్కసారిగా భారీ పేలుళ్లతో జనం వణికిపోయారు. భయంతో ప్రజలు వీధుల వెంట పరుగులు తీశారు. ఎరువులు, బాంబుల తయారీలో ఉపయోగించే 2750 టన్నుల అల్యూమినియం నైట్రేట్‌ను ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా ఆరేళ్లుగా పోర్టు ప్రాంతంలో నిల్వచేశారని అధ్యక్షుడు మేఖేల్‌ ఔన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్ర నిర్లక్ష్యమని, ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు.

పేలుళ్లకు కారణమైన బాధ్యులను విడిచిపెట్టబోమని, వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని ప్రధానమంత్రి హసన్‌ దియాబ్‌ హెచ్చరించారు. కాగా ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ప్రాథమిక దర్యాప్తుల్లో వెల్లడైందని అధికార వర్గాలు తెలిపాయి. పేలుడు పదార్ధాలు నిల్వ ఉంచిన వేర్‌హస్‌లో వెల్డింగ్‌ పనులు చేపట్టడంతోనే పేలుళ్లు ప్రారంభమయ్యాయని భద్రతాధికారులతో పాటు మీడియా పేర్కొంది.

పేలుడు తర్వాత గాల్లోకి ప్రమాదకర పదార్థాలు విడుదలయ్యాయన్నారు. ఇవి దీర్ఘకాలిక ప్రాణాంతక ప్రభావాలను కలిగిస్తాయని లెబనాన్ ఆరోగ్య మంత్రి చెప్పారు. అంతేకాక ప్రమాదకరమైన రసాయనాలను ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా ఆరేళ్లపాటు గిడ్డంగిలో నిల్వ చేసినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు దశాబ్ధాల తరబడి సాగిన అవినీతి, పాలనా వైఫల్యాలతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని లెబనాన్‌ ప్రజలు రాజకీయపార్టీలపై దుమ్మెత్తిపోస్తున్నారు. బీరూట్‌ పేలుళ్ల ప్రాంతాన్ని సందర్శించిన మేయర్‌ జమాల్‌ ఇతాని ఈ ప్రాంతం వార్‌ జోన్‌ను తలపిస్తోందని..తనకు మాటలు రావడం లేదని అన్నారు.పేలుళ్ల బీభత్సంతో కోట్లాది డాలర్ల నష్టం వాటిల్లిందని బీరూట్‌, లెబనాన్‌లకు ఇది కోలుకోలేని దెబ్బని వ్యాఖ్యానించారు.

 

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన, బాధితుల ఫిర్యాదు మేరకు రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదంలో ఆరుమంది మృతి

Roja on Tirupati Stampede: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే, సనాతన యోధుడు అని చెప్పుకునే ఆయన ఎక్కడ? అధికారుల నిర్లక్ష్యం వల్లే తిరుపతి తొక్కిసలాట జరిగిందని తెలిపిన రోజా

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, బాధితులకు అండగా ఉంటామని భరోసా

Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట, అధికారుల నిర్లక్ష్యంపై మండిపడిన చంద్రబాబు, భక్తులు భారీగా వస్తారని తెలిసీ ఎందుకు ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం

Share Now