IPL Auction 2025 Live

Russia Corona Vaccine: రష్యా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌, ఆగస్టు 12వ తేదీన రిజిస్టర్ చేయనున్నట్టు ప్రకటించిన రష్యా ఉప ఆరోగ్యశాఖ మంత్రి, మార్గదర్శకాలు పాటించాలని కోరిన డబ్ల్యూహెచ్ఓ

తాము డెవలప్ చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ ( Covid-19 Vaccine) ఆగస్టు 12వ తేదీన రిజిస్టర్ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేయించుకున్న తొలి దేశంగా నిలిచేందుకు సర్వం సిద్ధం చేసింది. ఆ దేశ రక్షణశాఖ, గమలేయ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు సంయుక్తంగా అభివృద్ధిచేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను (COVID-19 Vaccine Update) ఈ నెల 12న రిజిస్టరు చేయనున్నారు. ఈవిషయం స్వయంగా రష్యా ఉప ఆరోగ్యశాఖ మంత్రి ఒలెగ్‌ గ్రిడ్నెవ్‌ ప్రకటించారు.

coronavirus in india (Photo-ANI)

Moscow, August 10: ప్రపంచంలో కోవిడ్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ రేసులో రష్యా (Russia Corona Vaccine) ముందడుగు వేసింది. తాము డెవలప్ చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ ( Covid-19 Vaccine) ఆగస్టు 12వ తేదీన రిజిస్టర్ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేయించుకున్న తొలి దేశంగా నిలిచేందుకు సర్వం సిద్ధం చేసింది. ఆ దేశ రక్షణశాఖ, గమలేయ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు సంయుక్తంగా అభివృద్ధిచేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను (COVID-19 Vaccine Update) ఈ నెల 12న రిజిస్టరు చేయనున్నారు. ఈవిషయం స్వయంగా రష్యా ఉప ఆరోగ్యశాఖ మంత్రి ఒలెగ్‌ గ్రిడ్నెవ్‌ ప్రకటించారు.

అక్టోబర్ నుంచి దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ ఉత్పత్తి ( Covid-19 Vaccine Production ) భారీ స్థాయిలో ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తికాగానే.. తొలుత దాదాపు 1,600 మందికి (వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, వయో వృద్ధులకు) వ్యాక్సిన్‌ను అందిస్తామని తెలిపారు. దాని ప్రభావంతో వారి ఆరోగ్యాల్లో చోటుచేసుకునే మార్పులు ప్రాతిపదికగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని గ్రిడ్నెవ్‌ స్పష్టం చేశారు. దేశంలో తాజాగా 62,064 కేసులు నమోదు, 22 లక్షలు దాటిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు, యాక్టివ్‌గా 6,34,945 కేసులు, మరణాల సంఖ్య 44,386

కరోనావైరస్ టీకాకు ( Coronavirus Vaccine ) అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. తొలి కరోనావైరస్ వ్యాక్సిన్ అంటూ రష్యా చేసిన ప్రకటనపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( WHO ) స్పందించింది. టీకా తయారీ విషయంలో నిబంధనలు, మార్గదర్శకాలు పాటించాలని కోరింది. చికిత్స కోసం సిద్ధం అయిన వ్యాక్సిన్ అన్ని ట్రయల్స్ పూర్తి చేసుకోవాలి అని...అప్పుడే దాని పనితీరు తెలుస్తుందని WHO తెలిపింది. కరోనాకు చెక్ పెట్టినట్లే, కోవిడ్ వ్యాక్సిన్‌ను రూ.225కే విక్రయిస్తామని తెలిపిన సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో డీల్ కుదుర్చుకున్న గవి

ప్రస్తుతం చిట్టచివరిదైన మూడో దశ ప్రయోగ పరీక్షల తుది అంకం నడుస్తోందని, అది తప్పకుండా సఫలమవుతుందని రష్యా ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, ఈవ్యాక్సిన్‌తో 76 మంది వాలంటీర్లపై జూన్‌ 17న ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా వైర్‌సను తిప్పికొట్టేలా వారందరిలోనూ రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడంలో వ్యాక్సిన్‌ సఫలమైంది. కాగా, వ్యాక్సిన్‌ను త్వరగా విడుదల చేయాలనే తొందరలో రష్యా షార్ట్‌కట్‌లను అనుసరించి ఉండొచ్చని.. అలా చేస్తే వ్యాక్సిన్‌ సురక్షితంగా ఉండదని, పనితీరు కూడా ప్రభావవంతంగా ఉండకపోవచ్చని అమెరికాలోని జార్జ్‌టౌన్‌ వర్సిటీ ఆరోగ్యరంగ నిపుణులు లారెన్స్‌ గోస్టిన్‌ విశ్లేషించారు.



సంబంధిత వార్తలు

TG Weather Update: తెలంగాణపై చలి-పులి పంజా.. అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు రాత్రి ఉష్ణోగ్రతలు.. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. రానున్న మూడ్రోజుల్లో ఇంకా పడిపోనున్న ఉష్ణోగ్రతలు

Rains in AP: బంగాళాఖాతంలో వాయుగుండం.. నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. ఈ నెల 29 వరకు వానలే వానలు.. దక్షిణ కోస్తాలో ఈదురుగాలులు

Vaibhav Suryavanshi: 13 ఏళ్లకే ఐపీఎల్ మెగా వేలంలోకి, వైభవ్ సూర్యవంశీని రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

India–United States Relations: డొనాల్డ్ డ్రంప్ అమెరికా ఫస్ట్ వాణిజ్య విధానం, భారతదేశానికి కొత్త తలుపులు తెరిచే అవకాశం ఉందంటున్న నిపుణులు