COVID-19 Vaccine Price: కరోనాకు చెక్ పెట్టినట్లే, కోవిడ్ వ్యాక్సిన్‌ను రూ.225కే విక్రయిస్తామని తెలిపిన సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో డీల్ కుదుర్చుకున్న గవి
Coronavirus in India (Photo-PTI)

Pune, August 8: మహారాష్ట్రలో పూణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్​ ఇండియా (SII) అతితక్కువ ధరలో కోవిడ్-19 వాక్సీన్ (COVID-19 Vaccine) అందుబాటులోకి తెచ్చేందుకు కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ను (Coronavirus Vaccine) రూ.225కే అందించ‌నున్న‌ట్లు భార‌త్‌కు చెందిన ఫార్మా కంపెనీ సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ (Serum Institute of India) వెల్ల‌డించింది. ఈ మేరకు గవి (ది వ్యాక్సిన్ అలయన్స్), బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం వ్యాక్సిన్ తయారీ కోసం గేట్స్ ఫౌండేషన్ నుండి గవి ద్వారా 150 మిలియన్ డాలర్ల నిధులు సీరంకు అందుతాయి.

కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ముందంజలో ఉంద‌ని, ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు త‌యారు చేసిన టీకా ట్ర‌య‌ల్స్‌లో సత్ఫ‌లితాల‌ను ఇస్తోంది, అయితే ఈ టీకా బ‌య‌టికి వ‌స్తే ధ‌ర చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. దాని ధర ఎంతనేది ఇంకా అధికారికంగా తెలియలేదు. అంగస్తంభన ఔషధంతో కరోనాకు చెక్, ఆర్ఎల్‌ఎఫ్-100 కోవిడ్ కు విరుగుడుగా పనిచేస్తుందని తెలిపిన హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్, సెప్టెంబర్ 1 నుంచి ప్రయోగాలు

అయిదే దాని కన్నాముందుగా భారత ప్రజల కోసం కరోనా వ్యాక్సిన్‌ ఒక్క డోసును కేవలం రూ.225కే విక్రయిస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తయారు చేసిన క‌రోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేయ‌నుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు రెండు కలిసి క‌రోనా వ్యాక్సిన్‌ను తయారు చేశాయి. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభంలో 100 మిలియ‌న్‌ డోసుల‌ను ఉత్ప‌త్తి చేసి భారత్‌తోపాటు ఇతర దేశాలకు అందించ‌నుంది.

ప్రధానంగా ఇండియాలో కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్న తరుణంలో 10 కోట్ల మోతాదుల కరోనా వైరస్ వాక్సీన్లను తయారీ చేయనున్నామని ఎస్‌ఐఐ శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు డీల్‌పై సంతకాలు చేసినట్టు తెలిపింది. ఈ వ్యాక్సిన్ ఒక్కో డోస్ ధర గరిష్టంగా 3 డాలర్లు (సుమారు 225 రూపాయలు) ఉంటుందని, వీటిని 92 దేశాల్లో గవికి చెందిన కోవ్యాక్స్ అడ్వాన్స్ మార్కెట్ కమిట్‌మెంట్(ఏఎంసీ)లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది.  చైనాలో మరో ప్రమాదకర వైరస్, ఎస్ఎఫ్‌టీఎస్ దెబ్బకు ఏడు మంది మృతి, 60 మంది ఆస్పత్రిలో చేరిక, మ‌నుషుల ద్వారా వ్యాప్తి చెందుతుంద‌ని హెచ్చ‌రిక‌లు జారీ

2021 చివరి నాటికి కోట్లాది వాక్సిన్లను అందించాలనేది ప్రధాన లక్ష్యమని ఒక ప్రకటనలో తెలిపింది. బిల్‌గేట్స్, గేట్స్‌ ఫౌండేషన్‌, గావిసేత్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఎస్‌ఐఐ సీఈఓ అధమ్ పూనావల్లా ట్వీట్ చేశారు. 2021నాటికి అతి తక్కువ ధరలో ప్రపంచంలోని వెనుకబడిన దేశాలకు వ్యాక్సిన్‌ పంపిణీని వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

ఇదిలా ఉంటే ఎస్‌ఐఐ సంస్థతో తమవాక్సిన్ సరఫరా, లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు నోవావాక్స్ ఈ వారంలో ప్రకటించింది. ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకాతో తయారీ ఒప్పందాలను ఎస్‌ఐఐ ఇప్పటికే కుదుర్చుకుంది. అటు దేశంలో చివరి దశ మానవ పరీక్షలకు ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా టీకాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించిన సంగతి తెలిసిందే.