Condoms Free In France: 18-25 ఏండ్ల యువతకు కండోమ్స్ ఫ్రీ... ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సంచలన నిర్ణయం

18-25 ఏండ్ల మధ్య వయసున్న యువతీ, యువకులకు త్వరలో ఉచితంగా కండోమ్స్ ను అందుబాటులో ఉంచనున్నట్టు గురువారం ప్రకటించారు.

French President Emmanuel Macron (Credits: PTI)

Paris, Dec 9: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ (French President Emmanuel Macron) సంచలన నిర్ణయం తీసుకున్నారు. 18-25 ఏండ్ల మధ్య వయసున్న యువతీ, యువకులకు త్వరలో ఉచితంగా (Free) కండోమ్స్ ను (Condoms) అందుబాటులో ఉంచనున్నట్టు గురువారం ప్రకటించారు. అవాంచిత గర్భాలు, లైంగిక సంక్రమిత వ్యాధులు (ఎస్టీడీ-STD) నుంచి యువతను రక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

అధికారుల ఐడీలతో వేలాది నకిలీ రేషన్ కార్డుల జారీ.. జార్ఖండ్ లో సైబర్ నేరగాళ్ల హల్ చల్

యువతతో ఇక్కడ నిర్వహించిన ఆరోగ్యానికి సంబంధించిన ఓ సంవాదంలో ఆయన ఈ ప్రకటన చేశారు. గర్భనిరోధకానికి సంబంధించి ఇదో చిరు విప్లవం అని మెక్రాన్ తన నిర్ణయాన్ని అభివర్ణించారు. కాగా, వచ్చే ఏడాది నుంచే ఇది అమల్లోకి రానున్నట్టు సమాచారం.