Hong Kong protest: హక్కులు, అస్థిత్వం కోసం పోరాటం- హాంకాంగ్ ప్రజల నిరసన గళం! హంకాంగ్ చైనాలో భాగమా? చైనా- హాంకాంగ్ వివాదం ఏంటి?
ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. హాంకాంలో ఏం జరుగుతుంది?...
Fugitive Offenders and Mutual Legal Assistance in Criminal Matters Legislation (Amendment) Bill 2019. ఇదే హాంకాంగ్ నగరాన్ని అట్టుడికేలా చేస్తుంది. లక్షలాది జనాలు రోడ్లపైకి వచ్చి ఈ బిల్లుకు వ్యతిరేకంగా (Hong Kong anti-extradition bill protest 2019) తమ నిరసన గళం వినిపిస్తున్నారు.
ఈ బిల్ ఏంటంటే.. చైనా నుంచి హాంకాంగ్ లోకి అక్రమంగా చొరబడిన నేరస్తులను తిరిగి చైనాకు అప్పజెప్తూ వారిపై చట్టపరమైన, న్యాయపరమైన హక్కులను చైనాకే కల్పించండం. 2019 ఫిబ్రవరిలో హాంకాంగ్ ప్రభుత్వం ఈ బిల్లుకు రూపకల్పన చేసింది. అయితే ఈ బిల్లుకు మొదటి నుంచే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎట్టిపరిస్థితుల్లో ఈ బిల్లును ఎత్తివేయాలంటూ హాంకాంగ్ ప్రజలు ఒక ఉప్పెనలా ఎగిసిపడుతున్నారు. వివిధ రూపాలలో తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ బిల్లు పట్ల హాంకాంగ్ ప్రజల్లో ఎందుకంత వ్యతిరేకత? చరిత్ర ఏం చెబుతుంది?
హాంకాంగ్ నగరం చైనా పరిధిలోని భూభాగంలోనే ఉన్నా, దీనికి ప్రత్యేకమైన పరిపాలనాధికారాలు ఉన్నాయి. దాదాపు 150 ఏళ్లు హాంకాంగ్ బ్రిటీష్ పాలనలోనే కొనసాగింది. 1842 లో హాంకాంగ్ ద్వీపాన్ని , చైనా బ్రిటన్ కు అప్పజెప్పింది. ఆ తర్వాత బ్రిటన్ రాజ్యం తన పరిధిని విస్తరించుకుంటూ పోయింది. 1898లో చైనా మరికొన్ని టెరిటరీలను 99 సంవత్సరాల పాటు బ్రిటన్ కు లీజుకు ఇచ్చింది. ఈ లీజు ముగిసిన తర్వాత 1997లో హాంకాంగ్ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన టెరిటరీ ప్రాంతంగా అవతరించింది. తనకుతానుగా పాలనాపరంగా, న్యాయపరంగా, ఆర్థికపరంగా సరికొత్త వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంది. అప్పట్నించీ అక్కడి ప్రజలు తాము చైనీయులుగా కాకుండా హాంకాంగ్ వారిగా గుర్తింపబడేందుకు ఇష్టపడ్డారు.
కాలక్రమేనా, హాంకాంగ్ మంచి పురోభివృద్ధిని సాధించింది. వ్యవసాయం లాభసాటిగా సాగటం, పోర్టును కలిగి ఉండటంతో ఎగుమతి, దిగుమతులు పెరిగాయి. కొద్దికాలంలోనే హాంకాంగ్ వ్యాపారానికి మంచి కేంద్ర బిందువుగా మారిపోయింది. దీంతో ఇక్కడికి చైనా, ఇతర ప్రాంతాల నుంచి వలసలు పెరిగాయి.
ప్రస్తుతం.
ఇప్పుడు ఈ అక్రమ చొరబాటు నేరస్తులకు సంబంధించి చట్టపరమైన బిల్లు చైనాకు హాంకాంగ్ ప్రభుత్వం అప్పజెప్తే, హాంకాంగ్ ప్రజలపై చైనా పెత్తనం పెరుగుతుందని. ఇక్కడ తమకు ఉండే న్యాయపరమైన హక్కులు కోల్పోవాల్సి ఉంటుందని. తమ ప్రాంతంలో ఇతరుల జోక్యం ఏంటంటూ Civil Human Rights Front (CHRF) లాంటి కొన్ని ప్రజా సంఘాల అధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు.
The Power of People
ప్రభుత్వ అధికారులను నిర్బంధిస్తున్నారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్, రబ్బర్ బుల్లెట్లు పేల్చటం, భాష్పవాయు గోళాల ప్రయోగాలు చేస్తూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
చైనా వ్యవహారశైలి
అమెరికాను మించి అగ్రరాజ్యంగా ఎదగాలనుకుంటున్న చైనాకు ఇంకొకరిపై ఆధిపత్యం చెలాయించాలనే వైఖరి కొత్తేమి కాదు. హాంకాంగ్ ను చైనా ఒక వ్యాపార వస్తువుగానే చూసేది. ఎప్పుడూ లాభాపేక్షతోనే ఆలోచించేది. అయితే వలసదారులతో హాంకాంగ్ లో ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో చైనీయులపై హాంకాంగ్ ప్రజల పట్ల అయిష్టత నెలకొని ఉంది. చైనా నుంచి హాంకాంగ్ కు స్వతంత్రత దొరకాలని యువతలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో చైనా అప్రమత్తమైంది, ఇక హాంకాంగ్ పై పూర్తిగా పట్టు సాధించాలని చైనా చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే హాంకాంగ్ ప్రభుత్వం ఈ బిల్లుకు రూపకల్పన చేసింది.
హాంకాంగ్ కౌన్సిల్ లో 70 మంది సభ్యులుంటారు, వీటిలో చాలా స్థానాలకు ఎన్నికలు ఉండవు. ఆ స్థానాల్లో చైనాకు అనుకూలంగా వ్యవహరించే సభ్యులే నియమితులవుతారు. దీంతో అధికారికపరమైన వ్యవహారాల్లో చైనా అనుకూలురిదే ఆధిపత్యం. హాంకాంగ్ ప్రాంతం నుంచి తక్కువ సభ్యులు ఉంటారు. ఎవరైనా చైనాకు అనుకూలంగా వ్యవహరించకపోయినా, హాంకాంగ్ చైనాకు చెందినది కాదు అని ఎవరు మాట్లాడినా వారిని బహిష్కరిస్తారు. ఇదీ హాంకాంగ్ - చైనా వివాదం.
ఒకరి హక్కులను కాలదన్నే అధికారం ఎవరికి ఉండదు. అధికారంతో వచ్చిన శక్తి, ప్రజాశక్తిని ఎన్నటికీ ఓడించలేదు. ఎన్నో ప్రజా ఉద్యమాలే ఇందుకు ఉదాహారణలు. చూద్దాం ఆధిపత్యం కోసం ఒకరు, హాకుల కోసం ఒకరు సాగిస్తున్న ఈ పోరాటంలో విజేతలు ఎవరో.