Central University Students Protest (photo-Video Grab/YSRCP)

Anantapur, Feb 17: అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినులు హాస్టల్‌లో రక్షణ కరువైందంటూ రోడ్డెక్కారు. కొంతమంది ఆకతాయిలు తమ బాత్‌రూంలోకి తొంగి చూస్తున్నట్లు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.దీంతో, పోలీసులు, విద్యార్థి సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు.

వివరాల ప్రకారం.. అనంతపురంలోని బుక్కరాయసముద్రంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ (Central University) వద్ద అర్ధరాత్రి ఉద్రికత్త చోటుచేసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినిలు ఆందోళనకు (Central University Students Protest) దిగారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అమ్మాయి బాత్‌రూమ్‌ల్లోకి తొంగి చూశారని విద్యార్థినిలు ఆరోపించారు. దీంతో, వారంతా ఆందోళనకు దిగారు. అనంతరం, ఈ విషయాన్ని వీసీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వీసీ తీరుకు నిరసనగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు.అర్ధరాత్రి వరకు ఆందోళనలు చేశారు

పాట్నాలో దారుణం, వాంతులతో ఆస్పత్రికి వెళ్లిన యువకుడికి యూట్యూబ్ వీడియోలు చూసి వైద్యం చేసిన డాక్టర్, చికిత్స వికటించి బాధితుడు మృతి

కొంతకాలంగా ఇదే తంతు కొనసాగుతున్నట్లు తెలిపారు. DGP, DIGలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి మళ్లీ కొందరు బాత్‌రూంలోకి తొంగిచూడటంతో అమ్మాయిలు రోడ్డుపై ఆందోళనకు దిగారు. అయితే గతంలో ఈ ఘటనకు సంబంధించి యూనివర్సిటీని పరిశీలించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంతో మరోసారి ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.

అర్థరాత్రి ధర్నాకు దిగిన విద్యార్థినులు

సెంట్రల్ యూనివర్సిటీ హాస్టల్ చుట్టుపక్కల కన్‌స్ట్రక్షన్ పనులు చేస్తున్న కొంత మంది అదేపనిగా హాస్టల్‌ గదులతో పాటు, బాత్రూమ్ కిటీకీల నుంచి తొంగి చూస్తున్నారని, తమకు హాస్టల్‌లో రక్షణ కరువైన పరిస్థితి నెలకొందని స్టూడెంట్స్ వాపోతున్నారు. ఏ క్షణంలో ఎవరు వస్తారో అనే ఆందోళనలో విద్యార్థినులు గడుపుతున్నారు. వీటిపై సెంట్రల్ యూనివర్సిటీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.