Aaryan Shukla (Credits: X)

Hyderabad, Feb 15: గిన్నిస్‌ రికార్డు సృష్టించాలని కొందరికి జీవిత కలగా ఉంటుంది. అయితే, ఓ 14 ఏండ్ల బాలుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు గిన్నిస్‌ రికార్డులను (Guinness World Records) సృష్టించాడు. అదీ ఒక్కరోజులోనే. అందుకే అతన్ని హ్యూమన్ క్యాలిక్యులేటర్ కిడ్ (Human Calculator Kid) గా చెప్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన ఆర్యన్‌ శుక్లా (14) ఒక రోజులో ఆరు గిన్నిస్‌ రికార్డులను సృష్టించాడు. ఐదు అంకెలు గల 50 సంఖ్యలను 25.19 సెకండ్లలో కూడిక చేసి రికార్డు సృష్టించాడు. నాలుగు అంకెలు గల 100 సంఖ్యలను అత్యంత వేగంగా 30.9 సెకండ్లలో కూడిక చేయడం, నాలుగు అంకెలు గల 200 సంఖ్యలను 1 నిమిషం 9.68 సెకండ్లలో కూడిక చేయడం చేసి తన సత్తా చూపించాడు.

భర్త కాకుండా మరో పరాయి వ్యక్తిపై భార్య ప్రేమ, అనురాగం పెంచుకోవడం నేరం కాదు.. శారీరక సంబంధంలేనంత వరకూ వివాహేతర సంబంధంగా పరిగణించకూడదు.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఫిదా కావాల్సిందే..

అంతేకాదు, 20 అంకెలు గల సంఖ్యను 10 అంకెలు గల సంఖ్య చేత అత్యంత వేగంగా, అంటే  5 నిమిషాల 42 సెకండ్లలో భాగించడం, 2 ఐదు అంకెలు గల సంఖ్యల 10 సెట్స్‌ ను కేవలం 51.69 సెకండ్లలో గుణించడం, 2 ఎనిమిది అంకెల సంఖ్యల 10 సెట్స్‌ ను 2 నిమిషాల 35.41 సెకండ్లలో గుణించడం, నాలుగు అంకెల 100 సంఖ్యలను 30.9 సెకండ్లలో కూడిక చేయడం వంటి అత్యంత కష్టతరమైన లెక్కలను రెప్పపాటులో పూర్తి చేశాడు ఆర్యన్. బాలుడి బ్రెయిన్ ఫంక్షన్ కు అందరూ ఫిదా అవుతున్నారు.

మహా కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి.. 19 మందికి గాయాలు