![](https://test1.latestly.com/uploads/images/2025/02/5-278502132.jpg?width=380&height=214)
Bhopal, Feb 15: భర్త (Husband) కాకుండా మరో పరాయి వ్యక్తి పట్ల భార్య (Wife) ప్రేమానురాగాలు ప్రదర్శించడం నేరం కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు (Madhya Pradesh High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. పరాయి వ్యక్తితో భార్యకు శారీరక సంబంధం లేనంత వరకు దానిని వివాహేతర సంబంధంగా పరిగణించకూడదని స్పష్టం చేసింది. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని, కాబట్టి ఆమె మనోవర్తికి అనర్హురాలన్న భర్త వాదనను ఈ మేరకు ధర్మాసనం కొట్టేసింది. భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు రుజువైతేనే మీ పిటిషన్ పై ఆలోచిస్తామని, అప్పటివరకూ మనోవర్తి, పోషణ భత్యం చెల్లించాల్సిందేనని సదరు భర్తకు న్యాయస్థానం స్పష్టం చేసింది.
మహా కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి.. 19 మందికి గాయాలు
పోషించలేనప్పుడు అలా ఎందుకు?
విడిగా ఉంటున్న భార్యకు మధ్యంతర భరణంగా నెలకు రూ. 4 వేలు చెల్లించాలన్న ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును ఓ భర్త మధ్యప్రదేశ్ హైకోర్టులో సవాలు చేశాడు. పరాయి వ్యక్తితో తన భార్య ప్రేమగా ఉంటుందని, అలాగే తనకు తక్కువ ఆదాయం ఉన్నదని.. ఈ రెండు కారణాలతో తన భార్యకు భరణాన్ని ఇవ్వనని తేల్చిచెప్పాడు. ఈ క్రమంలో భర్త పిటిషన్ ను కొట్టేసిన కోర్టు మరిన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తకు అతి తక్కువ ఆదాయం వస్తుందన్న కారణంతో భరణాన్ని తిరస్కరించడం సరికాదని పేర్కొంది. తన రోజువారీ అవసరాలను కూడా తీర్చుకోలేనని తెలిసీ వివాహం చేసుకున్న పురుషుడు తర్వాత జరిగే పరిణామాలకు అతడే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. అతడు సమర్థుడైతే తన భార్యను పోషించుకోవడానికి, లేదా ఆమెకు ఎంతోకొంత చెల్లించేందుకు సంపాదిస్తాడని న్యాయస్థానం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది.