Pakistan Ex PM Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు, ఆసుపత్రికి తరలింపు, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
లాహోర్ నుండి ఇస్లామాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం వజీరాబాద్‌లో జరిగిన ర్యాలీపై గుర్తు తెలియని దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై దుండగులు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపుతోంది. లాహోర్ నుండి ఇస్లామాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం వజీరాబాద్‌లో జరిగిన ర్యాలీపై గుర్తు తెలియని దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇమ్రాన్‌ఖాన్‌తో సహా ఆరుగురు గాయపడగా, ఒకరు మృతి చెందారు..కాల్పులు జరిపాడన్న అభియోగంతో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నుండి కాల్పులు జరపడానికి గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్ గురువారం వజీరాబాద్ ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ వెళ్తున్నారు. అదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ బృందంపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇమ్రాన్‌ఖాన్ కాలికి బుల్లెట్ తగిలి గాయాలయ్యాయి. ఇమ్రాన్ మేనేజర్‌తో సహా 5 మంది మద్దతుదారులు కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయి,
కాల్పులు జరిగిన వెంటనే ఇమ్రాన్‌ను మద్దతుదారులు బుల్లెట్ ప్రూఫ్ కారులో ఎక్కించి అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ గాయపడినప్పటికీ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో, గాయపడిన ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుడు ఆసుపత్రిలో మరణించాడు.