Russia Bans 963 US Citizens: అమెరికా అధ్యక్షుడ్ని నిషేదించిన రష్యా, తమ దేశంలోకి రాకుండా బ్యాన్ విధిస్తూ నిర్ణయం, లిస్ట్‌ లో అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు, పలువురు సెలబ్రెటీలు, ఇప్పటి వరకు 963కు చేరిన నిషేదిత జాబితా

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను (Kamala Harries) తమ దేశంలోకి రాకుండా రష్యా (Russia) ప్రభుత్వం శాశ్వత నిషేధం విధించింది. దీంతో రష్యా ప్రభుత్వం ద్వారం శాశ్వత నిషేదానికి గురైన అమెరికా పౌరుల సంఖ్య 963కి చేరింది.

US President Joe Biden (Photo Credits: ANI)

Berlin, May 22: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను (Kamala Harries) తమ దేశంలోకి రాకుండా రష్యా (Russia) ప్రభుత్వం శాశ్వత నిషేధం విధించింది. దీంతో రష్యా ప్రభుత్వం ద్వారం శాశ్వత నిషేదానికి గురైన అమెరికా పౌరుల సంఖ్య 963కి చేరింది. యుక్రెయిన్ (Ukraine) కు అమెరికా మద్దతు, రష్యా ఆక్రమణ తర్వాత విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా పలువురు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ శనివారం తాజా ఆంక్షల జాబితాను విడుదల చేసింది. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ సభ్యులు, రిపబ్లికన్స్, టెక్ ఎగ్జిక్యూటివ్స్, జర్నలిస్టులు, సాధారణ అమెరికా పౌరులు, మరణించిన(గతంలో బ్రతికి ఉన్నపుడు) మరికొందరు చట్టసభ్యులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. కాగా అమెరికా నేతలు, పౌరులు, ప్రముఖులపై రష్యా శాశ్వత నిషేధం విధించడం పై రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం స్పందించింది.

“రష్యా ఘర్షణను కోరుకోదని..నిజాయితీగా, పరస్పర గౌరవంతో కూడిన చర్చలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంది. అధికారుల నుండి, రుస్సోఫోబియాను ప్రేరేపించే అమెరికన్ ప్రజలను మరియు దేశానికి సేవ చేసే వారి నుండి అమెరికా వేరు చేస్తుంది, ఈ వ్యక్తులు రష్యన్ ‘బ్లాక్ లిస్ట్’లో చేర్చబడ్డారు.” అని రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

Canadian MP Chandra Arya: కెన‌డా పార్ల‌మెంట్‌లో క‌న్న‌డ భాష మాట్లాడిన ఎంపీ, తన మాతృభాష మాట్లాడినందుకు గర్వంగా ఉందని వెల్లడి, సోషల్ మీడియలో నెటిజన్ల ప్రశంసలు 

రష్యా నిషేదిత జాబితాలో హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి, సెనేట్ మెజారిటీ నాయకుడు చార్లెస్ షుమర్ మరియు హౌస్ మైనారిటీ నాయకుడు కెవిన్ మెక్‌కార్తీతో సహా చాలా మంది కాంగ్రెస్ సభ్యులు ఉండగా, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు మాత్రం లేక పోవడం కొసమెరుపు. నటుడు మోర్గాన్ ఫ్రీమాన్, మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ మరియు మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ కూడా రష్యా నిషేదిత జాబితాలో ఉన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

IFS Officer Dies by Suicide: డిప్రెషన్‌లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన

US Travel Ban: డోనాల్డ్ ట్రంప్ దూకుడు! పాక్, ఆఫ్టనిస్తాన్‌పై ట్రావెల్ బ్యాన్‌ విధించే యోచన, వచ్చేవారమే అమల్లోకి వస్తుందని కథనాలు

Cyber Fraud in Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు, అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని లక్షలాది డాలర్లు హాంఫట్,సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Telangana Student Shot Dead in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు, ఎంఎస్ పట్టా అందుకోకుండానే తిరిగిరాని లోకాలకు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

Advertisement
Advertisement
Share Now
Advertisement