కెనడా పార్లమెంట్‌లో ఆ దేశ ఎంపీ క‌న్న‌డ‌లో అన‌ర్గ‌ళంగా మాట్లాడేశారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మాతృభాష‌ను అంద‌ళ‌మెక్కించినందుకు నెటిజ‌న్లు తెగ ప్ర‌శంస‌లు కురిపించారు. కెన‌డా ఎంపీ చంద్రఆర్య కెన‌డా పార్ల‌మెంట్‌లో క‌న్న‌డ భాష‌లో మాట్లాడారు. ఇత‌ర దేశాల పార్ల‌మెంట్ వేదిక‌గా క‌న్న‌డ భాష మాట్లాడ‌టం ఇదే ప్ర‌థ‌మంగా చెప్పుకోవచ్చు. ఇలా క‌న్న‌డ‌లో మాట్లాడ‌డానికి ఆ ఎంపీ కెన‌డా పార్ల‌మెంట్ స్పీక‌ర్ అనుమ‌తి తీసుకున్నారు. ఇలా క‌న్న‌డ భాష‌లో మాట్లాడినందుకు త‌న‌కు ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని చంద్ర ఆర్య చెప్పుకొచ్చారు. ఈ భాష‌ను 5 కోట్ల మంది మాట్లాడ‌తార‌ని వారంద‌రికీ ఎంతో గ‌ర్వంగా ఉంద‌న్నారు. ఇక ఉప‌న్యాసం ముగింపులో క‌న్న‌డ ర‌చ‌యిత కువెంపు రాసిన పాట‌తో త‌న ఉప‌న్యాసాన్ని ముగించారు. ఎక్క‌డ వున్నా… ఎలా వున్నా.. మీరు క‌న్న‌డిగులుగా వుండండి అన్న‌ది ఆ పాట సారాంశం.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)