Woman Dies on Plane: 4 ఏళ్ళ తర్వాత కుటుంబాన్ని చూడాలని భారత్ వస్తూ విమానంలో యువతి మృతి, టేకాఫ్‌కు ముందు కుప్పకూలి తిరిగిరాని లోకాలకు..

నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా తన కుటుంబాన్ని చూసేందుకు భారత్ వస్తూ క్వాంటాస్‌లోని మెల్‌బోర్న్-ఢిల్లీ విమానంలో 24 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన మహిళ మరణించింది.మన్‌ప్రీత్ కౌర్ అనే మహిళ జూన్ 20న ఢిల్లీకి క్వాంటాస్ విమానం ఎక్కిందని news.com.auలోని ఒక నివేదిక పేర్కొంది.

Indian-Origin Woman Dies on Plane (Photo-Gofundme)

Indian-Origin Woman Dies on Plane: నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా తన కుటుంబాన్ని చూసేందుకు భారత్ వస్తూ క్వాంటాస్‌లోని మెల్‌బోర్న్-ఢిల్లీ విమానంలో 24 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన మహిళ మరణించింది.మన్‌ప్రీత్ కౌర్ అనే మహిళ జూన్ 20న ఢిల్లీకి క్వాంటాస్ విమానం ఎక్కిందని news.com.auలోని ఒక నివేదిక పేర్కొంది. విమానాశ్రయానికి చేరుకోవడానికి కొన్ని గంటల ముందు మన్‌ప్రీత్ అకస్మాత్తుగా "అస్వస్థతకు గురయిందని ఆమె స్నేహితురాలు తెలిపింది. ఆమె విమానం ఎక్కిన తర్వాత సీటు బెల్ట్ పెట్టుకునే సమయంలో నేలపై పడి "అక్కడికక్కడే మరణించింది" అని ఆమె పేర్కొంది.

news.com.au కథనం ప్రకారం.. పంజాబ్‌కు చెందిన 24 ఏళ్ల మన్‌ప్రీత్ కౌర్ ప్రసిద్ధ చెఫ్‌ కావాలని కలలు కన్నది. 2020 మార్చిలో ఆమె ఆస్ట్రేలియా చేరుకుంది. కుకరీ చదివిన తర్వాత ఆస్ట్రేలియా పోస్ట్‌లో పనిచేస్తున్నది. నాలుగేళ్ల తర్వాత భారత్‌లోని తల్లిదండ్రులను చూడాలని భావించింది. అనుకున్న వెంటనే జూన్‌ 20న మెల్‌బోర్న్ నుంచి ఢిల్లీ వెళ్లే క్వాంటాస్ విమానంలోకి ఎక్కింది. ఆ తర్వాత సీటు బెల్టు పెట్టుకునేందుకు ఆమె ఇబ్బంది పడింది. కరెంట్ తీగలు తగిలి నడిరోడ్డు మీద కూలిన విమానం, ముగ్గురు ప్రయాణికులు మృతి, రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్

అనంతరం కొన్ని నిమిషాల్లోనే సీటు ముందు కుప్పకూలింది. టేకాఫ్‌కు ముందు ఆ విమానంలో చనిపోయింది. కాగా క్షయవ్యాధి వల్ల మన్‌ప్రీత్ కౌర్ మరణించినట్లు ఆమె స్నేహితులు భావిస్తున్నారు.ఈ కష్ట సమయంలో కౌర్ కుటుంబానికి సహాయం కోసం ‘గోఫండ్‌మి’ ద్వారా నిధుల సేకరణ చేపట్టారు.