Human Embryo Without Sperm: ఆడ మగ కలయిక లేకుండా పిండాన్ని సృష్టించిన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు, సైన్స్ రంగంలో అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్న ప్రయోగం

ఇజ్రాయెల్‌లోని శాస్త్రవేత్తలు సంచలన ప్రయోగం చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. స్త్రీ, పురుషుల కలయిక లేకుండా స్పెర్మ్, అండం లేదా గర్భాన్ని ఉపయోగించకుండా ప్రయోగశాలలోని మూలకణాల నుండి మానవ పిండం యొక్క నమూనాను రూపొందించారు,

Israeli scientists create model of human embryo without eggs or sperm (Photo Credit-Reuters)

ఇజ్రాయెల్‌లోని శాస్త్రవేత్తలు సంచలన ప్రయోగం చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. స్త్రీ, పురుషుల కలయిక లేకుండా స్పెర్మ్, అండం లేదా గర్భాన్ని ఉపయోగించకుండా ప్రయోగశాలలోని మూలకణాల నుండి మానవ పిండం యొక్క నమూనాను రూపొందించారు, పిండం అభివృద్ధి యొక్క ప్రారంభ దశల గురించి ప్రత్యేకమైన సమాచారం అందించారు.ఇజ్రాయెల్‌లోని వీజ్‌మాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బృందం ప్రకారం, ఈ మోడల్ 14వ రోజు పిండాన్ని పోలి ఉంటుంది, అయితే ఇది శరీర అవయవాలకు పునాదులు వేయడానికి ముందు అది అంతర్గత నిర్మాణాలను పొందుతుంది.

బోస్టన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ (ISSCR) వార్షిక సమావేశంలో జూన్‌లో ప్రీ-ప్రింట్ వచ్చిన తర్వాత శాస్త్రవేత్తల చేసిన ఈ ప్రయోగం బుధవారం నేచర్ జర్నల్‌లో ప్రచురించబడింది. దాని ప్రకారం..ఒక జీవి ప్రాణం పోసుకోవాలంటే అండం, శుక్రకణం తప్పనిసరి. ఏవో కొన్ని ఏకకణ జీవుల్లో మాత్రమే ఇందుకు మినహాయింపు. మనిషి పుట్టుకకు మాత్రం అండం, శుక్రకణం తప్పక కలవాల్సిందే. కానీ, ఇకపై వాటితో అవసరం లేకుండానే పిల్లలను పుట్టించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. జీవకణంతో మానవ పిండాన్ని సృష్టించారు. అదికూడా మహిళ గర్భంలో కాకుండా ప్రయోగశాలలో సృష్టించారు.

అమెరికాను వణికిస్తున్న కొత్త బ్యాక్టీరియా, విబ్రియో వల్నిఫికస్ బారీన పడి ఇప్పటికే 13 మంది మృతి, సముద్ర జలాలకు దూరంగా ఉండాలని సీడీసీ హెచ్చరిక

మనిషి మూలకణాన్ని ఉపయోగించి అచ్చం మానవ పిండాన్ని పోలిన ఆకారాన్ని వారు సృష్టించారు. ఈ పిండం ప్రయోగశాలలో 14 రోజులపాటు పెరిగింది. తల్లిగర్భంలో పిండం రూపుదాల్చే ప్రారంభ దశలో ఎలా ఉంటుందో ఈ కృత్రిమ పిండం కూడా అచ్చం అలాగే ఉన్నదని పరిశోధకులు తెలిపారు.ఈ ప్రయోగం గర్భాలపై ఔషధాల ప్రభావాన్ని పరీక్షించడానికి, గర్భస్రావాలు, జన్యుపరమైన వ్యాధులను బాగా అర్థం చేసుకోవడానికి, బహుశా కణజాలం, అవయవాలను మార్పిడి చేయడానికి కూడా ఈ పని కొత్త మార్గాలకు తలుపులు తెరిచిందని వారు చెప్పారు.

ఈ నమూనాలు ఏవీ పూర్తిగా సహజ మానవ అభివృద్ధిని పునశ్చరణ చేయవు, అయితే ప్రతి ఒక్కటి ఇప్పుడు మానవ అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలను ప్రయోగాత్మకంగా అధ్యయనం చేసే మార్గాలను జోడిస్తుంది" అని పరిశోధకులు చెప్పారు. మానవ పిండం అభివృద్ధిలో భవిష్యత్తులో తారుమారు చేసే అవకాశంపై అధ్యయనం కొన్ని నైతిక ప్రశ్నలను లేవనెత్తుతుంది. అయితే దీనిపై వారు స్పందించారు. దీన్ని న్యూక్లియర్ ఫిజిక్స్‌తో పోల్చాడు ఎవరైనా అణు బాంబును తయారు చేయడానికి ఎంచుకోవచ్చు కాబట్టి మీరు ఆ రంగంలో అన్ని పరిశోధనలను ఆపకూడదని వాదించారు.ప్రజలను నిమగ్నం చేయడం, పూర్తిగా తెలియజేయడం చాలా ముఖ్యమని అన్నారు.

దేశంలో కొత్త రకం బ్యాక్టీరియా కలకలం, శరీరంలోని మాంసాన్ని తినేసే బ్యాక్టీరియాతో ఓ వ్యక్తి మృతి, అతని జననాంగాలను, కింద అవయువాలను తినేసిన వైరస్

పరిశోధకులు మొదట ఎలుకలపై ఈ అధ్యయనం చేసి సఫలం అయ్యారు. అనంతరం ప్రయోగశాలలో పిండం రూపొందించేందుకు పూనుకున్నారు. మూలకాణాలను సేకరించి వాటిపై పరిశోధనలు చేశారు.మూల కణం పిండంగా మారేందుకు నాలుగు రకాల కణాలను రసాయనాలను ఉపయోగించి ప్రేరేపితం చేశారు. వాటిలో మొదటిది ఎపిబ్లాస్ట్‌ కణాలు. ఇవి పిండంగా మారేందుకు అవసరమవుతాయి. రెండోది ట్రోపోబ్లాస్ట్‌ కణాలు.. ఇవి ప్లాసెంటాను ఉత్పత్తి చేస్తాయి. మూడోది హైపోబ్లాస్ట్‌ కణాలు.. ఇవి పిండానికి అవసరమైన యోల్క్‌ శాక్‌ (పొర)ను రూపొందించేందుకు దోహదపడతాయి. నాలుగోది మెస్మోడెర్మ్‌ కణాలు.. ఇవి అమ్నియోటిక్‌ శాక్‌గా రూపాంతరం చెందుతాయి. అయితే 120 రకాల కణాలను పరస్పరం మిక్స్‌డ్‌ చేయగా.. వాటిలో 1 శాతం మాత్రమే సఫలమై పిండంగా రూపాంతరం చెందింది. అనంతరం మానవుల తరహాలోనే గర్భధారణ పరీక్ష చేసేందుకు వీలుగా హార్మోన్‌ను సైతం ఈ పిండం విడుదల చేసినట్టు పరిశోధకులు తెలిపారు.

సాధారణంగా 9-12 వారాల వయసున్న దాన్నే పిండంగా పేర్కొంటారు. ఆ సమయంలోనే మానవ అవయవాలు, అన్ని రకాల వ్యవస్థలు తయారై మానవ రూపం సంతరించుకుంటుంది. అప్పుడే పిండంగా పేర్కొంటారు. ఈ మోడల్‌ సృష్టి విరుద్ధం. ఈ మోడల్‌ను ఉపయోగించి మానవ అవయవాలను ఉత్పత్తి చేసుకోవచ్చు’ అని వీజ్‌మాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్‌ హన్నా తెలిపారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now