Italian Thief Viral Story: బుక్ ను చదువుతూ నిజంగానే బుక్కయిపోయాడు.. చోరీకి వచ్చిన దొంగను ఆకర్షించిన పుస్తకం.. అలాగే చదువుతూ ఉండిపోయిన దొంగ.. ఆ తర్వాత ఏమైందంటే?

చోరీ కోసం ఓ ఇంట్లోకి వచ్చిన ఓ దొంగ (38)ను ఆ ఇంట్లోని టేబుల్‌ మీద ఉన్న ఓ పుస్తకం ఎంతగానో ఆకర్షించింది.

Italian Thief Viral Story (Credits: X)

Rome, Aug 26: ఇటలీ (Italy) రాజధాని రోమ్‌ (Rome) లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. చోరీ కోసం ఓ ఇంట్లోకి వచ్చిన ఓ దొంగ (Thief)(38)ను ఆ ఇంట్లోని టేబుల్‌ మీద ఉన్న ఓ  పుస్తకం ఎంతగానో ఆకర్షించింది. దీంతో చోరీకి వచ్చానన్న విషయాన్ని మర్చిపోయిన దొంగ ఆ  పుస్తకం చదవడంలో  మునిగిపోయాడు. ఎంతలా అంటే, ఉదయం అయ్యి నిద్ర నుంచి యజమాని వచ్చి దొంగను ఎవరని ప్రశ్నించే వరకూ ఆ పుస్తకాన్ని చదువుతూనే ఉన్నాడు ఆ దొంగ. చివరకు యజమానిని చూసి షాకైన దొంగ పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే అతడు పోలీసులకు దొరికిపోయాడు.

హార్ట్ టచింగ్ వీడియో, 19 ఏళ్ళ తర్వాత భారత్‌లో తండ్రిని కలుసుకున్న జపాన్ కొడుకు, ఒక్కసారిగా హత్తుకుని ఏడ్చేసిన ఇరువురు..

ఏంటా పుస్తకం?

మరి ఆ దొంగను అంతగా ఆకర్షించిన ఆ పుస్తకం పేరు ఏంటో తెలుసా? ‘ది గాడ్స్‌ ఎట్‌ సిక్స్‌ ఓ క్లాక్‌’. గ్రీకు పురాణాలకు సంబంధించిన ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత గియోవన్నీ నుచీ రాశారు.

షాకింగ్ వీడియో ఇదిగో, లైవ్‌లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమికులు, పశ్చిమగోదావరి జిల్లాలో విషాదకర ఘటన