Howdy, Modi: సెప్టెంబర్‌లో నరేంద్ర మోదీ అమెరికా పర్యటన. ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని, మోదీ సభను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు. అమెరికా చరిత్రలో ఒక విదేశీ నాయకుడికి ఇంత ఆదరణ లభించడం ఇదే తొలిసారి

వచ్చే నెలలో అమెరికాలో Howdy, Modi వేడుకలో పాల్గొననున్న నరేంద్ర మోదీ. 'Howdy' అనేది అమెరికాలో వాడుక పదం. సింపుల్ గా చెప్పాలంటే Howdy, Modi అంటే How dou you do Modi..? ఎలా ఉన్నారు మోదీ అని ఒక ఆత్మీయ పలకరింపు లాంటింది.

PM Narendra Modi to address Indo-Americans in his US tour in September, 19. | Photo Credits: Getty Images)

ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఉత్తర అమెరికాలోని హోస్టన్ సిటీలో "Howdy, Modi" పేరుతో భారీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రవాస భారతీయులనుద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. 'Howdy' అనేది అమెరికాలో వాడుక పదం. సింపుల్ గా చెప్పాలంటే Howdy, Modi అంటే How dou you do Modi..? ఎలా ఉన్నారు మోదీ అని ఒక ఆత్మీయ పలకరింపు లాంటింది.

మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా (Live) వీక్షించేందుకు ఇప్పటికే 50 వేలకు పైగా మంది రిజస్టర్ అయ్యారు. సమావేశం దగ్గరపడే కొద్దీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

అయితే మోదీ సభకు ఇంత భారీగా మద్ధతు రావడం ఒక రికార్డు. గతంలో కూడా భారత ప్రధానులు అమెరికాలో సమావేశం నిర్వహించినప్పటికీ, ఈ స్థాయి స్పందన ఎప్పుడూ రాలేదు. ఉత్తర అమెరికాలో పోప్ ఫ్రాన్సిస్ నిర్వహించే సభలకు మినహా ఏ విదేశీ నాయకుడికి కూడా ఇంత భారీ సంఖ్యలో స్పందన రావడం ఇదే తొలిసారి అని చెప్తున్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఐరాస జనరల్ అసెంబ్లీ ఎన్నికలు అమెరికాలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారత ప్రధాని పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో మోదీ అమెరికా పర్యటన ఖరారైంది. అయితే ఆ ఎన్నికలకు ముందుగానే మోదీ సభ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. టెక్సాస్ ఇండియా ఫోరమ్ (TIF) అధ్వర్యంలో హోస్టన్ లోని NRG స్టేడియం వేదికగా మోదీ సభ జరగనుంది. ఈ సభలో పాల్గొనటానికి ఎవరైనా ఈ ఆగష్టు 29 వరకు తమ పేరును నమోదు చేసుకోవచ్చు.

ఉత్తర అమెరికాలోని హోస్టన్ సిటీలో చాలా మంది ప్రవాస భారతీయులు నివాసముంటున్నారు. ఆ ఒక్క సిటీలోనే దాదాపు 1 లక్షా 30 వేలకు పైగా ప్రవాస భారతీయులున్నట్లు అధికారిక జనాభా లెక్కల ప్రకారం తెలుస్తుంది. మోదీ తన పర్యటనలో భాగంగా బడా పారిశ్రామిక వేత్తలు, నాయకులను కలుసుకోబోతున్నారు.

భారత ప్రధాని సమావేశం నేపథ్యంలో అమెరికా సెనెటర్ జాన్ కార్నిన్, వందలవేల భారతీయుల తరఫున, అమెరికా ప్రజల తరఫున హోస్టన్ సిటీ మీకు సాదర స్వాగతం పలుకుతుంది అంటూ తమ ఆహ్వానాన్ని పంపారు. నరేంద్ర మోదీ సభతో భారత్- అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని, అమెరికాలో భారతీయులకు  మరిన్ని మంచి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Special Package For Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు గుడ్‌న్యూస్‌, ఏకంగా రూ. 11,500 కోట్ల స్పెషల్ ప్యాకేజీ ఇచ్చేందుకు కసరత్తు, కేంద్ర కేబినెట్‌ భేటీలో చర్చ

CM Revanth Reddy: ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

Meta Apologises to Indian Government: మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ కామెంట్లపై భార‌త్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మెటా సంస్థ, మాకు ఇండియా చాలా కీల‌క‌మైన దేశ‌మ‌ని వెల్లడి

Rupee Falls To All-Time Low: డాలర్ ముందు విలవిలలాడుతున్న రూపాయి, మళ్లీ మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయిన భారత కరెన్సీ, దేశ ఆర్థిక వ్యవస్థకూ దెబ్బ తప్పదంటున్న విశ్లేషకులు

Share Now