Sex is a Beautiful Thing: సెక్స్‌ అనేది దేవుడు ఇచ్చిన అందమైన వరం, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పోప్‌ ఫ్రాన్సిస్‌, ఎల్జీబీటీ వ్యక్తులను కేథలిక్ చర్చి స్వాగతించాలని వెల్లడి

శృంగారం గొప్పతనాన్ని క్రైస్తవ మత గురువు పోప్ ప్రాన్సిస్ ప్రశంసించారు. బుధవారం విడుదల చేసిన ఓ డ్యాక్యుమెంటరీలో ఆయన శృంగారం గురించి వివరించారు. దేవుడు మనిషికి అందమైన వస్తువులలో సెక్స్ ఒకటి అని ఆయన చెప్పుకొచ్చారు.

Pope Francis (File Photo)

శృంగారం గొప్పతనాన్ని క్రైస్తవ మత గురువు పోప్ ప్రాన్సిస్ ప్రశంసించారు. బుధవారం విడుదల చేసిన ఓ డ్యాక్యుమెంటరీలో ఆయన శృంగారం గురించి వివరించారు. దేవుడు మనిషికి అందమైన వస్తువులలో సెక్స్ ఒకటి అని ఆయన చెప్పుకొచ్చారు. గతేడాది రోమ్ లో 20ఏళ్ల వయస్సలో ఉన్న పది మంది యువకులతో ముచ్చింటించిన పోస్ ప్రాన్సిస్.. యువకులు అనేక అంశాలపై అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానాలను.. ది పోస్ ఆన్సర్స్ పేరుతో డిస్నీ ప్రొడక్షన్ డ్యాక్యుమెంటరీని విడుదల చేసింది.

మీకు తెలుసా?.. నేనింకా బతికే ఉన్నాను’.. బ్రాంకైటిస్ సమస్యతో ఆసుపత్రిలో చేరి.. కోలుకున్న తర్వాత పోప్ ఫ్రాన్సిస్ వ్యాఖ్య

ఈ డాక్యుమెంటరీలో సెక్స్‌ అనేది దేవుడు మానవులకు ఇచ్చిన అందమైన వాటిలో ఒకటి’గా ఆయన అభివర్ణించారు. దీంతో పాటుగా కేథలిక్‌ చర్చి పరిధిలోని ఎల్జీబీటీ హక్కులు, అబార్షన్, అశ్లీల పరిశ్రమ, శృంగారం, దైవ విశ్వాసం వంటి అనేక అంశాలపై యువకులు ప్రశ్నించారు. ఆయన వారికి ఓపికగా సమాధానాలిచ్చారు. ది పోప్ ఆన్సర్స్’ (The Pope Answers) పేరుతో డిస్నీ ప్రొడక్షన్ (Disney+ production) ఈ డ్యాక్యుమెంటరీని విడుదల చేసింది.

శ్వాసకోస సమస్యలతో ఆస్పత్రిలో చేరి పోప్ ఫ్రాన్సిస్, ప్రస్తుతం నిలకడగా ఆయన ఆరోగ్యం, కరోనా లేదని తెలిపిన వైద్యులు

ఎల్జీబీటీ హక్కుల గురించి పోప్ మాట్లాడుతూ.. వీరిని కేథలిక్ చర్చి తప్పనిసరిగా స్వాగతించాలని ఆయన గుర్తుచేశారు. ‘అందరూ దేవుడి బిడ్డలే.. ఆయనే తండ్రి. భగవంతుడు ఎవరినీ తిరస్కరించడు. అందువల్ల చర్చి నుంచి ఏ ఒక్కరినీ బయటకు పంపే హక్కు నాకు లేదు’ అని పోప్‌ అన్నారు. ఇక అబార్షన్లపై మాట్లాడుతూ ‘గర్భస్రావం చేయించుకున్న మహిళలపై మత ప్రబోధకులు కనికరం కలిగి ఉండాలి. కానీ ఈ ఆచరణ ఆమోదయోగ్యం కాదు’ అని అన్నారు.

Share Now

Advertisement
Share Now
Advertisement