Rome, April 2: సనాళాల (బ్రాంకైటిస్) సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) చికిత్స అనంతరం నిన్న వాటికన్ సిటీ (Vatican City) చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మీకు తెలుసా?.. నేనింకా బతికే ఉన్నాను’ అని వ్యాఖ్యానించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడతుండడంతో 86 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్‌ను బుధవారం రోమ్‌లోని గెమెల్లి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స అనంతరం పూర్తిగా కోలుకోవడంతో నిన్న వాకింగ్ స్టిక్‌తో ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి కారెక్కి వాటికన్ సిటీ వెళ్లిపోయారు.
Pope Francis leaves hospital, saying 'I'm still alive' https://t.co/hAQtJOKIBZ pic.twitter.com/zuhg5l0PZO
— Reuters (@Reuters) April 1, 2023
అక్కడ అప్పటికే వేచి వున్న శ్రేయోభిలాషులను పలకరించడంతోపాటు విలేకరులతో పోప్ మాట్లాడారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ఈస్టర్ సండే సేవలో పాల్గొని ప్రసంగిస్తానని తెలిపారు. గెమెల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ కుమార్తె మృతి చెందింది. దీంతో ఆమె రోదిస్తుండడాన్ని చూసిన పోప్ ఆసుపత్రి నుంచి బయటకు వస్తూ ఆమెను ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పాప తల్లిదండ్రులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు మీరు భయపడ్డారా? అన్న విలేకరుల ప్రశ్నకు ‘లేదని’ సమాధానమిచ్చారు. పోప్ చివరిసారి 2021లో ఆసుపత్రిలో చేరారు. అప్పట్లో ఆయన పెద్దపేగుకు శస్త్రచికిత్స జరిగింది.