పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గతకొంతకాలంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆయన శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో (respiratory infection) ఆస్పత్రిలో చేరారు. దీంతో రోమ్‌లోని వైద్యాలయంలో (Rome hospital) ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ కోవిడ్‌కు సంబంధించినది కాదని వైద్యులు పరీక్షల్లో నిర్ధారించారు. కొన్ని రోజులపాటు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటారని వైద్యులు తెలిపారు. 86 ఏళ్ల పోప్‌కు కరోనా లేదని వాటికన్ ప్రతినిధి మాటియో బ్రూనీ వెల్లడించారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)