Thailand Shooting: థాయిలాండ్‌లో చిన్న పిల్లలపై మాజీ పోలీసు ఆఫీసర్ కాల్పులు, చిన్నారులతో సహా 31 మంది మృతి, సాయుధుడిని పట్టుకోవాలని ప్రధాని ఆదేశాలు
కాల్పుల్లో సుమారు 31 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరణించినవారిలో చిన్నారులు, పెద్దలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
థాయిలాండ్‌లోని (Thailand Shooting)నార్త్ఈస్ట్రన్ ప్రావిన్సులోని చిల్డ్రన్ డే కేర్ సెంటర్‌లో కాల్పుల ఘటన జరిగింది. కాల్పుల్లో సుమారు 31 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరణించినవారిలో చిన్నారులు, పెద్దలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సామూహిక కాల్పులకు పాల్పడింది ఓ మాజీ పోలీసు ఆఫీసర్ అని తేల్చారు. అతని కోసం గాలింపు చేపట్టారు. సాయుధుడిని పట్టుకోవాలని ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. కాగా 2020లో ఓ సైనికుడు ఓ ప్రాపర్టీ విషయంలో కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో 29 మంది మరణించారు. 57 మంది గాయపడ్డారు.