UK Coronavirus Strain: అరవై దేశాలకు పాకిన యుకె కరోనావైరస్, 23 దేశాలకు పాకిన దక్షిణాఫ్రికా రకం కరోనావైరస్, వారంలోనే 47 లక్షల కరోనా కేసులు, కొవిడ్ వారపు నివేదికను విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

బ్రిటన్ కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ ప్రపంచాన్ని ప్రస్తుతం కలవరపెడుతున్న సంగతి విదితమే. మన దేశానికీ కూడా అది విస్తరించింది. కాగా ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలను బ్రిటన్ కరోనా (UK Coronavirus Strain) చుట్టేసిందని WHO తెలిపింది.

World Health Organization (File Photo)

Geneva, Jan 20: బ్రిటన్ కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ ప్రపంచాన్ని ప్రస్తుతం కలవరపెడుతున్న సంగతి విదితమే. మన దేశానికీ కూడా అది విస్తరించింది. కాగా ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలను బ్రిటన్ కరోనా (UK Coronavirus Strain) చుట్టేసిందని WHO తెలిపింది. బుధవారం కొవిడ్ వారపు నివేదికను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విడుదల చేసింది. అందులో కొత్త కరోనా స్ట్రెయిన్ (coronavirus strain) 60 దేశాలకు పాకిందనే విషయాన్ని పేర్కొంది. గత వారంలోనే 10 దేశాలకు అది వ్యాపించిందని డబ్ల్యూహెచ్ వో పేర్కొంది. దక్షిణాఫ్రికా రకం కరోనా 23 దేశాలకు పాకిందని చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా వారంలోనే 47 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పింది. అంతకుముందు వారంతో పోలిస్తే కేసులు 6 శాతం తగ్గాయని పేర్కొంది. అయితే, మరణాలు మాత్రం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. రికార్డ్ స్థాయిలో ఒక్క వారంలోనే 93 వేల మంది కరోనాకు బలయ్యారని, అంతకుముందు వారంతో పోలిస్తే అది 9 శాతం అధికమని పేర్కొంది. మొత్తంగా ప్రపంచమంతటా 9.3 కోట్ల మంది కరోనా బారిన పడగా.. 20 లక్షల మందికి పైగా మరణించారని పేర్కొంది.

భూటాన్‌కు ఉచితంగా వ్యాక్సిన్ సరఫరా, నేటి నుంచి కోవిడ్ వ్యాక్సిన్ ఇతర దేశాలకు ఎగుమతి, దేశంలో తాజాగా 13,823 కేసులు నమోదు, తెలంగాణలో కొత్తగా 267 కరోనా కేసులు

స్కూళ్లు తెరవాలనుకుంటే కరోనా కేసులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పాఠశాలల్లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా అతి తక్కువ మంది విద్యార్థులతో తరగతులు నిర్వహించాలని సూచించింది. సామూహిక వ్యాప్తి ఉన్న చోట కరోనా కేసులు ఎక్కువయ్యే ప్రమాదముందని, అలాంటి చోట విద్యార్థులు, సిబ్బందికి మహమ్మారి సోకకుండా యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. విద్యార్థుల తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు పరిస్థితిపై చర్చించాలని చెప్పింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement