Coronavirus in India: భూటాన్‌కు ఉచితంగా వ్యాక్సిన్ సరఫరా, నేటి నుంచి కోవిడ్ వ్యాక్సిన్ ఇతర దేశాలకు ఎగుమతి, దేశంలో తాజాగా 13,823 కేసులు నమోదు, తెలంగాణలో కొత్తగా 267 కరోనా కేసులు
Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, Jan 20: దేశంలో గత 24 గంటల్లో 13,823 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,95,660కు (Coronavirus in India) చేరింది. ఇందులో 1,97,201 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1,02,45,741 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,52,718 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో వైరస్‌ వల్ల 162 మంది (Covid Deaths) మరణించారని, 16,988 మంది ప్రాణాంతక వైరస్‌ బారినుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,94,977 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 50,523 మంది చనిపోయారు. ఇక, 9,33,077 కేసులతో కర్ణాటక రెండో స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

తెలంగాణలో  గత 24 గంటల్లో కొత్తగా 267 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 351 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,92,395 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,86,893 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,583 కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 3,919 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,270 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 55 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఈ సమస్యలు ఉంటే వ్యాక్సిన్ తీసుకోవద్దు, ఫ్యాక్ట్ షీట్‌ను రిలీజ్ చేసిన భార‌త్‌ బ‌యోటెక్, టీకా తీసుకున్న ప్రాంతంలో నొప్పి, వాపు, దుర‌ద వ‌చ్చే అవ‌కాశాలు

పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌ ఇండియా తయారు చేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ (coronavirus vaccine) ‘కొవిషీల్డ్‌’ 1.5లక్షల డోసులను భూటాన్‌కు తరలించారు. ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం తెల్లవారు జామున ఈ వ్యాక్సిన్లను తరలించారు. ఈ వ్యాక్సిన్‌ను ఆ దేశానికి భారత్‌ ఉచితంగా అందజేసింది. భారత్‌-భూటాన్‌ ప్రత్యేకమైన సంబంధాలకు అనుగుణంగా.. కొవిడ్‌ ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్‌కు వాణిజ్యం, అవసరమైన వస్తువులను ట్రాన్‌పోర్ట్ బబుల్‌ ఒప్పందం కింద నిరంతరం సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు పారాసిటమాల్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లు, ఎక్స్‌రే యంత్రాలతో పాటు రూ.2.8 కోట్ల విలువైన టెస్టింగ్‌ కిట్లు సహా అవసరమైన మందులు, వైద్య సామగ్రి అందించింది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న ఆ దేశ పౌరులను స్వదేశానికి పంపేందుకు భారత్‌ సదుపాయాలు కల్పించడంతో పాటు వందే భారత్‌ మిషన్‌ కింద 14 మందిని భూటాన్‌ పౌరులను ఆదేశానికి పంపింది. భూటాన్ ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు భారత్ అనేక చర్యలు తీసుకుంటోంది. తోర్షా టీ గార్డెన్ (ఇండియా), అహ్లే (భూటాన్) ద్వారా కొత్త వాణిజ్య మార్గాన్ని తెరవడం సహా నాగార్కట, అగర్తాలా, పాండు, జోగిగోపా నది ఓడరేవుల్లో కొత్త వాణిజ్య కేంద్రాలు త్వరలో పని చేయనున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. ప్రపంచ సమాజం ఆరోగ్య అవసరాలను తీర్చడంలో భారతదేశం దీర్ఘకాల విశ్వసనీయ భాగస్వామిగా గౌరవించబడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ట్వీట్‌ చేశారు.

వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఇద్దరు మృతి, కోవిడ్ వ్యాక్సినేషన్‌ వల్ల చనిపోలేదంటున్న వైద్యులు, కరోనాతో కేరళలో సీపీఎం ఎమ్మెల్యే మృత్యువాత, దేశంలో అత్యంత తక్కువగా 10,064 కేసులు నమోదు

అనేక దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్ల సరఫరా బుధవారం ప్రారంభమవుతుందని, రాబోయే రోజు మరిన్ని దేశాలు అనుసరిస్తాయని పేర్కొన్నారు. పొరుగు, ముఖ్య భాగస్వామి దేశాల నుంచి భారతీయ వ్యాక్సిన్‌ల సరఫరా కోసం ప్రభుత్వానికి పలు అభ్యర్థనలు వచ్చాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) మంగళవారం ఓప్రకటనలో తెలిపింది. దేశంలో తయారవుతున్న రెండు కోవిడ్ -19 వ్యాక్సిన్లకు కొవిషీల్డ్, కొవాగ్జిన్లకు భారతదేశం అత్యవసర వినియోగ అధికారాన్ని ఇచ్చింది. అయితే దేశీయ అవసరాలకు తగినన్ని నిల్వలు ఉండేలా చూసుకోవడంతో పాటు విదేశాలకు సరఫరా చేయనున్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది.